IPL Youngest Player: సచిన్, యువరాజ్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు

Published : Apr 20, 2025, 07:23 AM ISTUpdated : Apr 20, 2025, 07:30 AM IST

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అతను 14 సంవత్సరాల 23 రోజులు వయస్సులో ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు.

PREV
15
IPL Youngest Player: సచిన్, యువరాజ్ రికార్డులు బ్రేక్..   ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు
Vaibhav Suryavanshi

IPL Youngest Player Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో 36వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా ఆడలేదు. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అతను ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. 

25

దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒక కోటి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన యంగ్ ప్లేయర్ ఇప్పటికే క్రికెట్ మైదానంలో తన ప్రతిభను చూపించాడు.

35
Vaibhav Suryavanshi (Photo- IPL)

రంజీ క్రికెట్ 2023-24లో కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసులోనే ఆడాడు. రంజీల్లో అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా అప్పట్లోనే రికార్డు సృష్టించాడు. అప్పట్లోనే సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లను వెనక్కి నెట్టాడు. యువరాజ్ 15 సంవత్సరాల 57 రోజుల వయసులో రంజీల్లో అరంగేట్రం చేయగా, సచిన్ 15 సంవత్సరాల 230 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. 

45
Vaibhav Suryanvanshi. (Photo: Vaibhav Suryavanshi Instagram/@vaibhav_sooryavanshi09)

అతి పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన క్రికెటర్లు

  1. వైభవ్ సూర్యవంశీ- 14 సంవత్సరాలు, రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2025
  2. ప్రయాస్ రే వర్మన్- 16 సంవత్సరాలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2025
  3. ముజీబ్ ఉర్ రెహమాన్- 17 సంవత్సరాల 11 రోజులు, పంజాబ్ కింగ్స్, ఐపీఎల్ 2018
  4. రియాన్ పరాగ్ - 17 సంవత్సరాల 175 రోజులు, రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2019
  5. సర్ఫరాజ్ ఖాన్ - 17 సంవత్సరాల 177 రోజులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2015

 

55
Vaibhav Suryavanshi IPL

లక్నో సూపర్ జెయింట్స్ పై ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ

యశస్వి జైస్వాల్ తో కలిసి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ను వైభవ్ సూర్యవంశీ ప్రారంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్  కొట్టాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన బంతిని కవర్స్ మీదుగా సూపర్ సిక్సర్ కొట్టాడు. దీంతో ఐపీఎల్ అరంగేట్రంలోనే తొలి బంతికే సిక్సర్ కొట్టిన ప్లేయర్ గా, అలాగే ఐపీఎల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అతిపిన్న వయస్కుడైన ప్లేయర్ గా నిలిచాడు. తన తొలి మ్యాచ్ లో 170 స్ట్రైక్ రేటుతో 34 పరుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.

Read more Photos on
click me!

Recommended Stories