DC vs GT: ఐపీఎల్ 2025లో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. జోస్ బట్లర్ సూపర్ నాక్ తో చివరి ఓవర్ లో శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టుపై థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.
Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 2025లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగుతూ క్రికెట్ లవర్స్ కు మస్తు మజాను అందించింది. అదే ఐపీఎల్ 2025 35వ మ్యాచ్. ఇందులో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది.
24
IPL 2025: Gujarat Titans vs Delhi Capitals
గుజరాత్ విజయంలో హీరోగా నిలిచాడు జోస్ బట్లర్. అద్భుతమైన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో తన జట్టుకు విజయాన్నిఅందించాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆ టీమ్ లోని ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో డబుల్ సెంచరీ స్కోర్ ను సాధించింది.
204 పరుగుల టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు రెండో ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జోస్ బట్లర్ క్రీజులో కుదురుకున్న తర్వాత దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు.
34
IPL 2025: Gujarat Titans vs Delhi Capitals
మొదట సాయి సుదర్శన్ (36)తో, ఆ తర్వాత షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (43)తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి గుజరాత్ విజయానికి పునాది వేశాడు. చివరి వరకు క్రీజులో ఉండి జీటీకి విజయాన్ని అందించాడు. జోస్ బట్లర్ తన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అద్భుతమైన నాక్ ఆడిన బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
చివరి ఓవర్ లో ఉత్కంఠ
19వ ఓవర్ 5వ బంతికి బాగా బ్యాటింగ్ చేస్తున్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను ముఖేష్ కుమార్ క్యాచ్ అవుట్ చేయడంతో గుజరాత్ అభిమానుల్లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా సింగిల్ తీసుకొని చివరి ఓవర్‌లో స్ట్రైక్‌ను కొనసాగించాడు. గుజరాత్ గెలవడానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం.
44
మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్ మొదటి బంతికే తెవాటియా సిక్స్ కొట్టి, మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ చేతిలోకి తీసుకువచ్చాడు. తర్వాతి బంతికి విన్నింగ్ ఫోర్ కొట్టడం గుజరాత్ విజయం సాధించింది. తెవాటియా 3 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్ల చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు.
ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ను తన బౌలింగ్ తో వణికించాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీసుకున్నాడు. సీనియర్ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇషాన్ తన మూడు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.