బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? క్రికెట్ కు బాక్సింగ్ కు ఏంటి సంబంధం? ఆ పేరు ఎలా వచ్చింది?

First Published | Dec 25, 2024, 10:04 AM IST

What Is Boxing Day Test: డిసెంబర్ 26న ఆస్ట్రేలియా vs భారత్,  సౌతాఫ్రికా vs పాకిస్థాన్,  జింబాబ్వే vs ఆఫ్ఘనిస్తాన్ లు టెస్టు మ్యాచ్ ను ఆడనున్నాయి. అయితే, వీటిని బాక్సింగ్ డే టెస్టు అని పిలుస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌ని బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు అంటున్నారు? బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి?

విరాట్ కోహ్లీ

Boxing Day Test: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ లో భాగంగా భార‌త్-ఆస్ట్రేలియాలు మెల్‌బోర్న్ వేదిక‌గా నాలుగో టెస్టు ఆడ‌నున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, ఆస్ట్రేలియా అడిలైడ్‌లో పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

దీంతో మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు చాలా కీల‌కం కావ‌డంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. అయితే, సాధార‌ణంగా జ‌రిగే ఈ టెస్టును బాక్సింగ్ డే టెస్టు అని ఎందుకు అంటున్నారు?  బాక్సింగ్ కు క్రికెట్ కు సంబంధం ఏంటి? అస‌లు బాక్సింగ్ డే టే టెస్ట్ అంటే ఏమిటి?  దీనికి ఆ పేరు ఎలా వ‌చ్చింది? 

ఇండియా vs ఆస్ట్రేలియా

బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి? 

క్రిస్మస్ తర్వాత జరిగే ఈ మ్యాచ్‌ని బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదైనా ఒక టెస్టు మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్టుగా వర్గీకరించాలంటే  అది డిసెంబర్ 26న ప్రారంభం కావాలి. సాధారణంగా క్రిస్మస్ తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్‌కి బాక్సింగ్ డే అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి చాలా దేశాల్లో బాక్సింగ్ డే అంటే ప్రభుత్వ సెలవుదినం. చారిత్రాత్మకంగా క్రిస్మస్ తో పాటు ఈ రోజున యజమానులు, ధనిక కుటుంబాలు తమ ఉద్యోగులు, పనివారు, ఆర్థికంగా వెనుకబడిన వారికి బహుమతులు ఇచ్చే సందర్భంగా మారింది. క్రిస్మస్ వేడుకల తర్వాత కృతజ్ఞతలు తెలియజేయడానికి, మంచి సంకల్పాన్ని వ్యాప్తి చేయడానికి ఇది ఒక మార్గంగా కొనసాగుతోంది. 


ఆస్ట్రేలియా టెస్ట్

బాక్సింగ్ డే అని ఎందుకు అంటారు?

క్రికెట్ ప్రపంచంలో బాక్సింగ్ డే టెస్ట్ ఒక సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో, ప్రతి సంవత్సరం ప్రసిద్ధ మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఇతర దేశాలు కూడా ఈ రోజున టెస్టు మ్యాచ్ ను ఆడటం ప్రారంభించాయి. ఆస్ట్రేలియాలో ఈ సంప్రదాయం 1950లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌తో ఆడినప్పుడు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది క్రికెట్ క్యాలెండర్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బిగ్ ఈవెంట్‌లలో ఒకటిగా మారింది. ఈ మ్యాచ్ సాధారణంగా ఆస్ట్రేలియాను ఒక విదేశీ జట్టుతో తలపెడుతుంది. మొదటి రోజు వేల మంది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా హాజరయ్యే క్రికెట్ మ్యాచ్‌లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

విరాట్ కోహ్లీ

బాక్సింగ్ డే సంప్రదాయాలు

బాక్సింగ్ డే టెస్ట్ కేవలం క్రికెట్ మ్యాచ్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఇది సెలవుదినం కావడంతో అన్ని కార్యక్రమాల, క్రీడల ఉత్సవాల కలయికగా మారింది. పండుగ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి క్రీడలను ఆస్వాదించడానికి ఇది ఒక ప్రత్యేక సందర్భంగా మారింది. ఈ సంప్రదాయం క్రికెట్‌లో చాలా ముఖ్యమైన సంఘటనలకు సాక్షంగా నిలుస్తోంది. అనేక రికార్డులు బద్దలయ్యాయి. కొత్త రికార్డులు వచ్చి చేరాయి. మ్యాచ్ ముగింపు కూడా ఏవరూ ఊహించని విధమైన సందర్భాలను చూశాయి. దక్షిణాఫ్రికా వంటి ఇతర క్రికెట్ దేశాలు కూడా దీన్ని అనుసరించాయి. అక్కడ కూడా బాక్సింగ్ డే టెస్ట్‌లు జరుగుతాయి. ఇది బాక్సింగ్ డే టెస్టు ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది.

బాక్సింగ్ డే టెస్ట్ కేవలం మ్యాచ్ కాదు.. ఇది క్రికెట్, సంస్కృతి, పండుగ వేడుకల కలయిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఇది ఒక ప్రత్యేకమైన ఈవెంట్ మారింది. అందుకే డిసెంబర్ 26న జరిగే టెస్టు మ్యాచ్ లను బాక్సింగ్ డే టెస్టు అని పిలుస్తారు.

బాక్సింగ్ డే టెస్టు కథేంటో తెలుసా?

బాక్సింగ్ డే టెస్టుల చరిత్ర ఇది.. 

ఆస్ట్రేలియాలో 1950-51 యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ టెస్టు మ్యాచ్ డిసెంబర్ 22న ప్రారంభం కాగా, 25వ తేదీ సెలవు దినం. అప్పటి నుంచి బాక్సింగ్ డే టెస్టు క్రికెట్ కు, ఆస్ట్రేలియా వేసవికి పర్యాయపదంగా మారింది. అయితే ఈ రోజు (డిసెంబర్ 26-డిసెంబర్ 30) బాక్సింగ్ డే టెస్టు 1980లో జరిగింది. గత 43 ఏళ్లలో అత్యధిక బాక్సింగ్ డే టెస్టులు ఆస్ట్రేలియాలో ముఖ్యంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగాయి. ఈ ఏడాది ఆరు జట్లు బాక్సింగ్ డే టెస్టు ఆడుతున్నాయి. 2024 డిసెంబర్ 26న ఆస్ట్రేలియా vs భారత్,  సౌతాఫ్రికా vs పాకిస్థాన్,  జింబాబ్వే vs ఆఫ్ఘనిస్తాన్ లు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లను ఆడనున్నాయి.

Latest Videos

click me!