36 బంతుల్లో సెంచరీ బాదిన ఉస్మాన్ ఖాన్! ఇవి టీ20 మ్యాచులేనా... అతి పెద్ద జోక్‌గా మారిన పీఎస్ఎల్...

Published : Mar 11, 2023, 09:22 PM IST

టీ20లు వచ్చిన తర్వాత వన్డేలకు ఆదరణ తగ్గింది. టీ20 క్రికెట్‌లో బ్యాటర్‌ ఆధిక్యాన్ని పెంచేందుకు పవర్ ప్లే వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే టీ20ల్లో 200 కొట్టడమంటే చాలా పెద్ద విషయమే. అయితే పాక్ సూపర్ లీగ్‌లో కాదు... పీఎస్‌ఎల్ 2023 సీజన్‌లో నమోదవుతున్న స్కోర్లు చూస్తే మతిపోవడం ఖాయం...

PREV
17
36 బంతుల్లో సెంచరీ బాదిన ఉస్మాన్ ఖాన్! ఇవి టీ20 మ్యాచులేనా... అతి పెద్ద జోక్‌గా మారిన పీఎస్ఎల్...

పెషావర్ జెల్మీ 242 పరుగులు చేస్తే, దాన్ని ఊదిపాడేసింది ముల్తాన్ సుల్తాన్స్. ఆ తర్వాతి మ్యాచ్‌లో పెషావర్ జెల్మీ 240 పరుగులు చేస్తే క్వెట్టా గ్లాడియేటర్స్ 18.2 ఓవర్లలోనే దాన్ని ఛేదించింది. ఇస్లామాబాద్ యునైటెడ్ 206 పరుగుల టార్గెట్‌ని 20వ ఓవర్‌లో కొట్టేసింది...

27

బ్యాటింగ్ చేయడం ఇంత తేలికా? బౌండరీలు కొట్టడం ఇంత ఈజీనా... అన్నట్టుగా పాక్ సూపర్ లీగ్‌లో వరుసగా సెంచరీలు నమోదవుతూనే ఉన్నాయి. పీఎస్‌ఎల్‌కి క్రేజ్ తెచ్చేందుకు బౌండరీ సైజుని భారీగా తగ్గించింది పీసీబీ. ఉమెన్స్ ప్రీమయర్ లీగ్‌లో బౌండరీ సగటున 65 మీటర్ల దూరంలో ఉంటే, పాక్ సూపర్ లీగ్‌లో అది 55 మీటర్లే. అంటే మహిళల కంటే చిన్న బౌండరీలో ఆడుతున్నారు పాక్ ప్లేయర్లు...

37

తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్, 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బౌండరీ అవతల పడేశాడు. 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 120 పరుగులు చేసిన ఉస్మాన్ ఖాన్, 9 ఓవర్లలోపే సెంచరీ మార్కును అందుకున్నాడు...

47

ఉస్మాన్ ఖాన్ ఈజీగా డబుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారంతా. అయితే మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు ఉస్మాన్ ఖాన్. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు...

57

రిలే రిసో 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ముల్తాన్ సుల్తీన్స్ టీమ్ 20 ఓవర్లలో 262/3 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఇలా 200+ స్కోరు నమోదైతే బాగుంటుంది.  ప్రతీ మ్యాచ్‌లోనూ 220-250 పరుగులు వచ్చేస్తే మాత్రం అది టీ20 క్రికెట్‌నే చంపేసినట్టు అవుతుంది.. 

67

పీఎస్‌ఎల్ 2023 సీజన్‌లో ఇది ఏడో సెంచరీ. ఇప్పటికే మార్టిన్ గుప్తిల్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, జాసన్ రాయ్, ఫకార్ జమాన్, రిలే రిసో సెంచరీలు చేసుకున్నారు. చిన్న గ్రౌండ్‌లో బ్యాటింగ్‌కి అనుకూలించే తారు రోడ్డు లాంటి పిచ్‌ల మీద టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్నట్టుగా సెంచరీలు బాదేస్తున్నారు బ్యాటర్లు.. 

77

ఇలాంటి క్రికెట్‌లో తన పరువు తానే తీసుకుంటోంది పాక్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే పాక్ పిచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ అర్థమైంది. ఇప్పుడు నమోదవుతున్న భారీ స్కోర్లు, పాక్ సూపర్ లీగ్‌ అంటే ఓ జోకర్ లీగ్‌గా ఫ్రాంఛైజీ క్రికెట్‌లో గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.  

click me!

Recommended Stories