సెంచరీతో కెఎల్ రాహుల్‌కి చెక్ పెట్టేసిన శుబ్‌మన్ గిల్... ఇక సునీల్ శెట్టి అల్లుడికి అదొక్కటే దిక్కు...

Published : Mar 11, 2023, 03:31 PM IST

కెఎల్ రాహుల్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడే అతికొద్ది ప్లేయర్లలో ఒకడైన కెఎల్ రాహుల్, ఇప్పుడు ఒకే ఒక్క ఫార్మాట్‌కి పరిమితమయ్యాడు. అది కూడా రిషబ్ పంత్ వస్తే ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి...

PREV
19
సెంచరీతో కెఎల్ రాహుల్‌కి చెక్ పెట్టేసిన శుబ్‌మన్ గిల్... ఇక సునీల్ శెట్టి అల్లుడికి అదొక్కటే దిక్కు...

2019 తర్వాత టెస్టుల్లో చోటు కోల్పోయాడు కెఎల్ రాహుల్. ఆ సమయంలో రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతూ ఉండడంతో వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడాడు. అయితే 2020-21 ఆస్ట్రేలియా టూర్ తర్వాత రిషబ్ పంత్ ఆటతీరు మారింది...

29
KL Rahul

బ్రిస్బేన్ టెస్టు తర్వాత రిషబ్ పంత్, మూడు ఫార్మాట్లలోకి ఎంట్రీ ఇచ్చాడు. పంత్ వచ్చినా కెఎల్ రాహుల్, వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా కొనసాగుతూ వచ్చాడు. 2021 ఇంగ్లాండ్ పర్యటనకి ముందు శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడడంతో లక్కీగా రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు కెఎల్ రాహుల్...

39

అప్పటి నుంచి టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా, ఫ్యూచర్ కెప్టెన్‌గానూ బీసీసీఐ పెద్దల గుర్తింపు పొందాడు. అయితే ఏ ముహుర్తాన సౌతాఫ్రికా టూర్‌లో రాహుల్, తాత్కాలిక కెప్టెన్‌గా మారాడో కానీ అక్కడి నుంచే అతని టైం పూర్తిగా మారిపోయింది...

49

బంగ్లాదేశ్ పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా రెండు మ్యాచులు గెలిచినా, బ్యాటుతో పేలవ ఫామ్ కొనసాగించిన కెఎల్ రాహుల్, టీ20లతో పాటు టెస్టుల్లోనూ చోటు కోల్పోయాడు. వాస్తవానికి మొదటి రెండు టెస్టులు ఫెయిల్ అయినా చివరి రెండు టెస్టుల్లో సునీల్ శెట్టి అల్లుడైన కెఎల్ రాహుల్‌కి అవకాశం దక్కేదే...

59
Shubman Gill

కాకపోతే బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని తప్పించి, కెఎల్ రాహుల్‌ని ఆడించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో భీకరమైన దాడి చేశాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్. మధ్యలో కెఎల్ రాహుల్‌కి సపోర్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఆకాశ్ చోప్రా వల్ల అది కాస్తా రచ్చగా మారి, పెద్ద పెంట జరిగింది..

69

ఇంత రాద్ధాంతం జరిగాక కెఎల్ రాహుల్‌ని మళ్లీ ఆడించే సాహసం చేయలేకపోయింది టీమిండియా. మూడో టెస్టులో టీమ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ తర్వాత సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ గిల్లే...
 

79

శుబ్‌మన్ గిల్ సెంచరీతో కెఎల్ రాహుల్‌కి టెస్టుల్లో ప్లేస్ దాదాపు పోయినట్టే. ఇప్పుడు అతను మళ్లీ టెస్టు టీమ్‌లోకి రావాలంటే వికెట్ కీపింగ్ చేయడం ఒక్కటే మార్గం. ఎందుకంటే రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఆ ప్లేస్ ఖాళీగా ఉంది...
 

89

KL Rahul

పంత్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన శ్రీకర్ భరత్ పెద్దగా మెప్పించలేకపోతున్నాడు. కాబట్టి అతని ప్లేస్‌లో కెఎల్ రాహుల్‌ టీమ్‌లోకి రావచ్చు. అయితే టీ20ల్లో, వన్డేల్లో వికెట్ కీపింగ్ చేసినంత ఈజీ కాదు, టెస్టుల్లో వికెట్ల వెనకాల 90 ఓవర్ల పాటు వంగి ఉండడం...

99
Image credit: PTI

అయితే ఆఖరి టెస్టు రెండో రోజున కెఎల్ రాహుల్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఒకవేళ నాలుగో టెస్టులో శ్రీకర్ భరత్ తప్పులు రిపీట్ చేస్తే మాత్రం, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రాహుల్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఆడించే సాహసానికి టీమిండియా పూనుకునే అవకాశం లేకపోలేదు.. 

Read more Photos on
click me!

Recommended Stories