టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి ఊర్వశి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాను నోరు మూసుకుని ఉన్నానని, దానిని అలుసుగా తీసుకోవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అంతేగాక రిషభ్ పంత్ కు రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పింది. తాను ఎవరిని బద్నాం చేయలేదని, అంత ఖర్మ తనకేం పట్టలేదని పేర్కొంది. చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు.