PAK vs WI: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. కెరీర్ పీక్స్ లో ఉన్న ఆజమ్.. రికార్డులను తుడిచి పెట్టేస్తున్నాడు.
గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్ తో రికార్డులను తుడిచిపెట్టేస్తున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్. వరుస మ్యాచులలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఆజమ్.. తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
26
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ముల్తాన్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో బాబర్.. 93 బంతుల్లో 77 రన్స్ చేశాడు. అయితే ఇది బాబర్ కు వరుసగా 9వ హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు కావడం విశేషం.
36
గడిచిన 9 ఇన్నింగ్స్ లో (అన్ని ఫార్మాట్లలో) అతడు 50 ప్లస్ స్కోరు చేయడం ఇది 9వసారి. దీంతో అతడు జావేద్ మియాందాద్ రికార్డును అధిగమించాడు. మియాందాద్.. 1987 లో వరుసగా 8 సార్లు 50 ప్లస్ స్కోరు చేశాడు. తాజాగా బాబర్ ఆ రికార్డును అధిగమించాడు.
46
మూడు ఫార్మాట్లలో కలిపి గత 9 ఇన్నింగ్స్ లలో బాబర్ సాధించిన స్కోర్లివి : 196 (ఆస్ట్రేలియా పై.. 2వ టెస్టులో ).. 67, 55 (3వ టెస్టులో ఆసీస్ మీద).. ఆసీస్ తో వన్డే సిరీస్ లో వరుసగా 57, 114, 105 చేశాడు.
56
ఇక ఆసీస్ తో జరిగిన ఏకైక టీ20 లో 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో 103 రన్స్ చేయగా.. శుక్రవారం ముగిసిన రెండో వన్డేలో 77 పరుగులు రాబట్టాడు.
66
బాబర్ ఇటీవలే 13 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు చేయడంతో అతడికి ఈ రికార్డు వశమైంది. గతంలో విరాట్ కోహ్లి 17 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు.