నేను సంపాదించేదంతా ఆయనకే ఇచ్చా.. దాని నుంచి దూరంగా ఉంచమన్నా : తిలక్ వర్మ

Published : Jun 11, 2022, 02:42 PM IST

Tilak Varma: ఐపీఎల్ లో ఈసారి నిలకడగా రాణించిన ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ ఒకడు. ఈ ఆంధ్రా కుర్రాడు  ముంబై జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. 

PREV
17
నేను సంపాదించేదంతా ఆయనకే ఇచ్చా.. దాని నుంచి దూరంగా ఉంచమన్నా : తిలక్ వర్మ
Mumbai Indians

ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్  అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అనుకున్నంతగా రాణించలేకపోయినా  ఆ జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకలా నిలిచాడు ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ. సీజన్ ఆసాంతం రాణించిన అతడిని  ఐపీఎల్ వేలంలో  దక్కించుకుంది ముంబై. 

27

రూ. 1.70 కోట్లతో తిలక్ వర్మను కొనుగోలు చేసినందుకు గాను ముంబైకి పలు మ్యాచుల్లో విజయాలు అందివ్వడమే గాక ఆ జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆదుకున్నాడు. అయితే డబ్బు రావడంతో తాను  మారిపోలేదని.. అవన్నీ తన తండ్రికే ఇచ్చానని చెప్పుకొచ్చాడు. 
 

37

తిలక్ మాట్లాడుతూ.. ‘నేను క్రికెట్ నేర్చుకుని అండర్-16 కు ఆడుతున్న క్రమంలో చాలా కష్టాలు పడ్డాను.  ఆ రోజులను నేనెప్పటికీ మరిచిపోలేను. నా క్రికెట్ కిట్ తో బస్ ఎక్కితే కొన్నిసార్లు బస్ లోకి రానిచ్చేవారు కాదు. 
 

47

క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న తర్వాత నేను ఇంటిని దాదాపుగా మరిచిపోయాను.ఇప్పుడు నేను అనుభవిస్తున్నదానికి నేను చాలా కోల్పోయాను. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నీ త్యాగం చేసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన  సోదరి  పెళ్లికి కూడా నేను హాజరుకాలేకపోయాను. 

57

ఇప్పుడంటే నాకు అన్నీ ఉన్నాయి.  ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కు వెళ్లాలంటే  బస్ లో వెళ్లాల్సిన పన్లేదు. నాకున్న సంపాదనతో నేను సొంతగా కార్ కొనుక్కోవచ్చు. 

67

అండర్-16 టీమ్ కు ఆడుతున్నప్పుడు ఉదయం 6 గంటలకే గ్రౌండ్ కు వెళ్లేవాడిని. ఎప్పుడో సాయంత్రమైతే తప్ప ఇంటికి రాకపోయేవాడిని. నా దృష్టంతా క్రికెట్ మీదే ఉండేది.  క్యాంప్ నకు వెళ్లకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అన్నం, రెస్ట్ వంటివైనా మిస్ చేసుకునేవాడిని గానీ ప్రాక్టీస్ అయితే మిస్ కాలేదు..’ అని తిలక్ వర్మ తెలిపాడు.

77

ఐపీఎల్ వేలంలో తనకు కోటిన్నర వచ్చినా తాను మాత్రం ఆ డబ్బులను తన నాన్నకే ఇచ్చేశాడని తిలక్ అన్నాడు. ‘డబ్బుకు ఎవర్నైనా ప్రభావితం చేసే శక్తి ఉంది. అందుకు నేనేమీ అతీతుడనేమీ కాదు. అందుకే నా డబ్బులన్నీ మా నాన్నకు ఇచ్చేవాడిని. అవి నా కంట పడకుండా చూడమని చెప్పేవాడిని..’ అని  అన్నాడు. 

click me!

Recommended Stories