కృనాల్ పాండ్యా అకౌంట్ హ్యాక్ అయ్యిందా? లేక మద్యం మత్తులో? దీపక్ హుడాకి ఛాన్స్ రాగానే...

First Published Jan 27, 2022, 10:31 AM IST

టీమిండియాలో ఆప్తమిత్రులు అంటే చాలా మంది ఉండొచ్చేమో కానీ బద్ధ శత్రువులు మాత్రం కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలే. ఈ ఇద్దరి మధ్య వైరం దాదాపు ఏడాదిన్నరగా టీమిండియాలోనే హాట్ టాపిక్... ఇప్పుడు కూడా ఈ వైరంపై చర్చ జరుగుతోంది.

గత ఏడాది సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీకి ముందు తనని అందరి ముందు బూతులు తిట్టి, అవమానించాడని బరోడా కెప్టెన్‌పై క్రికెట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు అప్పటి బరోడా వైస్ కెప్టెన్ దీపక్ హుడా...

అయితే బరోడా క్రికెట్ అసోసియేషన్ ఈ విషయంపై విచారణ జరిపి, కెప్టెన్‌పై ఫిర్యాదు చేసిన దీపక్ హుడాపై నిషేధం వేటు విధిస్తూ నిర్ణయం తీసుకుంది... ఏడాదిపాటు బరోడా తరుపున మ్యాచులు ఆడకుండా బ్యాన్ విధించింది...

దీంతో బరోడా నుంచి రాజస్థాన్‌కి మారిన దీపక్ హుడా, విజయ్ హాజారే ట్రోఫీలో ఆ టీమ్‌ని నడిపించాడు. దేశవాళీ టోర్నీల్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా దీపక్ హుడాకి టీమిండియా నుంచి పిలుపు దక్కింది...

సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్ పెద్దగా రాణించకపోవడంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్‌గా దీపక్ హుడాని ఎంపిక చేశారు సెలక్టర్లు...

సరిగ్గా దీపక్ హుడాకి టీమిండియా నుంచి పిలుపు వచ్చిన రోజే, కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్‌లో వింత వింత ట్వీట్లు రావడం విశేషం...

బిట్ కాయిన్ కోసం తన అకౌంట్‌ను అమ్మేస్తానంటూ, ఓ అమ్మాయి అంటే తనకి ఇష్టమంటూ కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ నుంచి బీ గ్రేడ్ ట్వీట్లు వచ్చాయి...

కొందరు కృనాల్ పాండ్యా అకౌంట్ హ్యాక్ అయ్యిందని అంటుంటే, మరికొందరు ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఈ ఆల్‌రౌండర్ మద్యం మత్తులో ఇలా ట్వీట్లు వేస్తున్నాడంటూ తేల్చి పారేశారు...

కృనాల్ పాండ్యా అకౌంట్ ఒకే ఫోన్ నుంచి రెండు సార్లు లాగిన్ అయిందని, హ్యాక్ అయితే ఇలా చేయడం కుదరదని అంటున్నారు... మనోడే కాస్త మత్తులో ఉండి ఇలాంటి ట్వీట్లు చేసి ఉంటాడని అంటున్నారు...

దీపక్ హుడాకి బీసీసీఐ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చిన రోజే, కృనాల్ పాండ్యా అకౌంట్ నుంచి ఇలాంటి ట్వీట్లు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది...

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ ద్వారా ఆరంగ్రేటం చేసిన కృనాల్ పాండ్యా, మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నా... శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఫెయిల్ అయి జట్టులో చోటు కోల్పోయాడు...

click me!