రవిభిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌, దీపక్ హుడాలకు అవకాశం... విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇదే...

Published : Jan 27, 2022, 09:24 AM IST

సౌతాఫ్రికా టూర్ ముగించుకుని స్వదేశం చేరుకున్న భారత జట్టు, ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో కలిసి వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

PREV
111
రవిభిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌, దీపక్ హుడాలకు అవకాశం... విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇదే...

సౌతాఫ్రికా టూర్‌కి ముందు గాయపడిన రోహిత్ శర్మ, ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

211

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేయర్‌గా ఈ సిరీస్‌కి అందుబాటులో ఉండబోతున్నాడు. దాదాపు 10 నెలల తర్వాత కోహ్లీ, రోహిత్ కలిసి ఆడబోతున్నారు... 

311

సీనియర్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విండీస్ టూర్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు. అలాగే వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మొదటి వన్డే ముగిసిన తర్వాత ఫిబ్రవరి 9 నుంచి జట్టుకి అందుబాటులోకి వస్తాడు...

411

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో రెండు టెస్టు నుంచి జట్టుకి దూరమైన రవీంద్ర జడేజా, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి కూడా దూరం కాబోతున్నాడు...

511

అక్షర్ పటేల్ వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత టీ20 సిరీస్ సమయానికి జట్టుకి అందుబాటులోకి వస్తాడు. గాయం కారణంగా జట్టుకి దూరమైన వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు...

611

బరోడా ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి వన్డే జట్టులో అవకాశం కల్పించిన సెలక్షర్లు, యంగ్ స్పిన్నర్ రవిభిష్ణోయ్‌తో పాటు యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్‌కి టీ20, వన్డే సిరీస్‌లలో చోటు కల్పించారు...

711

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌ నుంచి అనేక సార్లు తుదిజట్టులో ఆడే అవకాశాన్ని కోల్పోయిన ఆవేశ్ ఖాన్, విండీస్ సిరీస్ ద్వారా ఆరంగ్రేటం చేయడం ఖాయంగా మారింది...

811

సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భువనేశ్వర్ కుమార్‌కి టీ20 సిరీస్‌లో మరో అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, వన్డే సిరీస్‌లో మాత్రం ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్ ఇచ్చారు...

911

మహ్మద్ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్‌ రెండు సిరీసుల్లోనూ పేస్ విభాగాన్ని నడిపించబోతుంటే, వెంకటేశ్ అయ్యర్‌, హర్షల్ పటేల్‌లకి టీ20ల్లో, కుల్దీప్ యాదవ్‌కి వన్డేల్లో చోటు దక్కింది...

1011

టీ20 సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, రవి భిష్ణోయ్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్...

1111

వన్డే సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవిభిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్... 

click me!

Recommended Stories