ఆ ఇద్దరినీ తప్పించలేదు! టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్లని ఎంపిక చేయకపోవడానికి అసలు కారణం ఇదే..

Published : Jun 26, 2023, 01:24 PM IST

వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఎవ్వరికీ చోటు దక్కలేదు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడిన మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లను కూడా టీమ్ నుంచి తప్పించారు సెలక్టర్లు..

PREV
16
ఆ ఇద్దరినీ తప్పించలేదు! టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్లని ఎంపిక చేయకపోవడానికి అసలు కారణం ఇదే..
Mohammed Shami

ఐపీఎల్ 2023 సీజన్‌లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన మహ్మద్ షమీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు..

26
Pujara-Umesh Yadav

తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయిన ఉమేశ్ యాదవ్, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో షమీ తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేస్తే తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్, రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు..

36
Mohammed Shami

ఐపీఎల్ నుంచి యమా బిజీగా గడుపుతున్న మహ్మద్ షమీ, వ్యక్తిగత కారణాలతో వెస్టిండీస్ టూర్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వన్డే వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టేందుకు షమీ, తన ఫిట్‌నెస్ పైన ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది..

46
Umesh Yadav

ఐపీఎల్ 2023 సీజన్‌లో 8 మ్యాచులు ఆడి ఒకే ఒక్క వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్, గాయంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత సీజన్‌లో 16 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, ఈసారి ఫామ్‌లో లేకపోయినా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి..

56
Image credit: PTI

స్వదేశంలో ఉమేశ్ యాదవ్‌కి ఘనమైన రికార్డు ఉంది. అయితే విదేశాల్లో మాత్రం అతని ట్రాక్ రికార్డు సరిగా లేదు. అదీకాకుండా ఉమేశ్ యాదవ్ హార్మ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం..
 

66

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చేరిన ఉమేశ్ యాదవ్, ఈ ఏడాది చివర్లో జరిగే సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో కూడా చోటు దక్కించుకోవడం కష్టమే. విండీస్ టూర్‌కి ఎంపికైన శార్దూల్ ఠాకూర్, ముకేశ్ కుమార్, మహ్మద్ సిరాజ్ ఫెయిలైతే మళ్లీ ఉమేశ్ యాదవ్‌కి చోటు దక్కొచ్చు.. 

click me!

Recommended Stories