అర ఇంచు తేడాతో కలిసి వచ్చిన అదృష్టం... అజింకా రహానే టెస్టు కెరీర్‌ని కాపాడిన ఆ నో బాల్! లేకుంటేనా...

Published : Jun 26, 2023, 12:42 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఓడిన తర్వాత నెల రోజుల బ్రేక్ తీసుకున్న టీమిండియా, వెస్టిండీస్ టూర్‌కి సిద్ధమవుతోంది. విండీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో అజింకా రహానేకి చోటు దక్కడమే కాదు, 17 నెలల తర్వాత తిరిగి టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కింది..  

PREV
16
అర ఇంచు తేడాతో కలిసి వచ్చిన అదృష్టం... అజింకా రహానే టెస్టు కెరీర్‌ని కాపాడిన ఆ నో బాల్! లేకుంటేనా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసిన అజింకా రహానే, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. 17 నెలల తర్వాత టెస్టు టీమ్‌లోకి తిరిగి వచ్చిన రహానే పర్ఫామెన్స్‌ని మెచ్చిన సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్... అతన్ని తిరిగి వైస్ కెప్టెన్‌గా నియమించింది..

26

బంగ్లాదేశ్ టూర్‌లో సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫెయిల్ కావడంతో వెస్టిండీస్ టూర్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే ఒక్క నో బాల్.. రహానే కెరీర్‌ని కాపాడింది..

36

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకి ఆలౌట్ అయిన తర్వాత రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టింది టీమిండియా. రోహిత్ శర్మ 15, శుబ్‌మన్ గిల్ 13, ఛతేశ్వర్ పూజారా 14, విరాట్ కోహ్లీ 14 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ అయ్యారు..
 

46

71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. 17 నెలల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న అజింకా రహానే, 22వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయినట్టు అంపైర్ నిర్ణయం ప్రకటించాడు. అయితే రహానే, డీఆర్‌ఎస్ కోరుకున్నాడు..

56
Pat Cummins

టీవీ రిప్లైలో బాల్ వేసే సమయంలో ప్యాట్ కమ్మిన్స్, గీత దాటి ముందుకు వచ్చినట్టు తేలడంతో థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. కమ్మిన్స్ అర ఇంచు లోపల అడుగు పెట్టి ఉంటే అజింకా రహానే తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుట్ అయ్యేవాడు...

66
Ajinkya Rahane

ఇదే జరిగి ఉంటే ఛతేశ్వర్ పూజారాతో పాటు అజింకా రహానేని కూడా నిర్మొహమాటంగా టీమ్ నుంచి తప్పించేవాళ్లు సెలక్టర్లు. ప్యాట్ కమ్మిన్స్ వేసిన ఆ నో బాల్ కారణంగా అజింకా రహానే టెస్టు కెరీర్‌ మళ్లీ నిలబడింది.. 

click me!

Recommended Stories