ఇది 1983 వరల్డ్ కప్‌ విజయంతో సమానం... అండర్19 ఉమెన్స్ టీమ్‌తో సచిన్ టెండూల్కర్...

First Published Feb 2, 2023, 10:01 AM IST

సౌతాఫ్రికాలో జరిగిన మొట్టమొదటి ఐసీసీ ఉమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌‌ని గెలిచి, విశ్వవిజేతగా నిలిచింది టీమిండియా. షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత అమ్మాయిలు, అంచనాలను మించి రాణించి... మొట్టమొదటి అండర్19 వరల్డ్ కప్ సాధించారు... అండర్19 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్‌ని ఘనంగా సత్కరించింది బీసీసీఐ...

అండర్19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళా జట్టుకి రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ చూసేందుకు ఆహ్వానించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌‌కి ముందు.. షెఫాలీ వర్మ టీమ్‌ని సత్కరించింది బీసీసీఐ...

Image credit: PTI

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత మాజీ క్రికెటర్, ‘లెజెండ్’ సచిన్ టెండూల్కర్, వరల్డ్ విన్నింగ్ టీమ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ అత్యుద్భుత విజయాన్ని అందుకున్నందుకు మీ అందరికీ నా అభినందనలు. ఈ విజయాన్ని దేశం మొత్తం కొన్నేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకుంటుంది...

Image credit: Getty

భారత జట్టు 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నేను కూడా అలా టీమిండియా కోసం ప్రపంచ కప్ గెలవాలని కలలు కన్నాను. వాటిని నిజం చేసుకోవడానికి ఎంతగానో శ్రమించాను. మీ విజయం కూడా అలాంటి ఎన్నో కలలను, కలల కనే ఆలోచనను అమ్మాయిల్లో చిగురింప చేస్తుంది...

Image credit: Getty

దేశంలో చాలామంది అమ్మాయిలు, తాము కూడా ఇలాంటి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), ఉమెన్స్ క్రికెట్‌లో అతి పెద్ద మార్పును తీసుకురాబోతుంది. క్రీడల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒక్కటే... అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలు రావాలి...’ అంటూ ప్రసంగాన్ని ముగించాడు సచిన్ టెండూల్కర్...

Image credit: Getty

ఈ కార్యక్రమంలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీతో పాటు సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ ఆశీష్ సీలర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి రూ.5 కోట్ల చెక్‌ని వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌కి అందచేశారు.. 

click me!