బీసీసీఐలో చీలికలు? విరాట్ కోహ్లీని తప్పించి, కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ ఇవ్వడంపై గంగూలీపై...

First Published Jan 25, 2022, 1:08 PM IST

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే కాదు, భారత క్రికెట్ బోర్డులో కూడా చీలికలు వచ్చినట్టు తెలుస్తోంది... సౌతాఫ్రికా టూర్‌లో భారత పేలవ ప్రదర్శనతో బోర్డు రెండుగా చీలినట్టు సమాచారం...

టీమిండియాకి మూడు ఫార్మాట్లలోనూ అద్భుత విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ టైటిల్ గెలవకపోయినా ద్వైపాక్షిక సిరీసుల్లో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది...

అలాంటి విరాట్ కోహ్లీని వన్డే సారథిగా తప్పించి, అతన్ని అగౌరవపరిచింది బీసీసీఐ. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ తీసుకున్న నిర్ణయమే, వన్డేల్లో కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణమని చెప్పాడు గంగూలీ...

అయితే బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఫీలైన విరాట్ కోహ్లీ, కేప్ టౌన్ టెస్టు తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు...

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోలేదని, అతన్ని తప్పించారని వార్తలు వినిపించాయి. ఈ సంఘటనలు భారత క్రికెట్ బోర్డులో కూడా చీలికలు తెచ్చాయట...

గత సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ గెలవకపోయినా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో 5-1 తేడాతో విజయాన్ని అందుకుని, ఆతిథ్య జట్టుకి షాక్ ఇచ్చింది...

విరాట్ కోహ్లీని వన్డే సారథిగా తప్పించాలని భావిస్తే, దానికి సరైన సమయం, సందర్భం చూసి ఆ నిర్ణయం తీసుకోవాల్సిందని, గంగూలీ ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారట కొందరు సభ్యులు...

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి సరైన సమాచారం లేకుండానే అతన్ని వన్డే సారథిగా, టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారట...

వైస్ కెప్టెన్‌‌గా ఎంపిక చేసిన తర్వాత రోహిత్ శర్మ ఫిట్‌గా లేడని తేలడంతో కెఎల్ రాహుల్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ, వన్డే కెప్టెన్సీ ఇవ్వడం... అతని సారథ్యంలో భారత జట్టు నాలుగు మ్యాచుల్లో చిత్తుగా ఓడడం జరిగిపోయాయి...

తన ఇగోల కోసం సౌరవ్ గంగూలీ, ఇలాంటి నిర్ణయాలతో భారత క్రికెట్ జట్టును చిక్కుల్లో పడేశాడని, ఈ స్థానంలో మరో వ్యక్తి ఉంటుంటే సీన్ వేరేగా ఉండేదని బీసీసీఐలో మిగిలిన అధికారులు అనుకుంటున్నారట. 

‘అసలు కెఎల్ రాహుల్‌లో ఏ కోశానైనా కెప్టెన్ కనిపిస్తున్నాడా?’ అని ఓ బీసీసీఐ అధికారి, మీడియాతోనే తన అసహనాన్ని వ్యక్తం చేయడం విశేషం...

ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే... జట్టులో విరాట్ డామినేషన్ తగ్గించాలనే ఉద్దేశంతో బీసీసీఐ తీసుకున్న ఓ నిర్ణయం, మొదటికే మోసం వచ్చేలా చేసిందంటున్నారు విశ్లేషకులు...

ఇప్పుడున్న పరిస్థితుల నుంచి టీమిండియా మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కి రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల్సిందే...

అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడకపోయినా, సరైన విజయాలు రాకపోయినా... బీసీసీఐలో చీలకలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!