అప్పుడు ఎమ్మెస్ ధోనీ చేసిన పని, కెఎల్ రాహుల్ చేసి ఉంటే... సౌతాఫ్రికాలో రిజల్ట్ వేరేగా ఉండేది...

First Published Jan 25, 2022, 12:20 PM IST

కెప్టెన్‌గా మొదటి నాలుగు మ్యాచుల్లోనూ విజయాన్ని అందుకోలేకపోయాడు కెఎల్ రాహుల్. భారత జట్టు భావి సారథిగా భావిస్తున్న కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా, సౌతాఫ్రికా చేతుల్లో వైట్ వాష్ అయ్యింది...

కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ అటు బ్యాటింగ్‌లో కానీ, ఇటు జట్టును నడిపించడంలో కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు... ఫలితం సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్...

భారత జట్టును మిడిల్ ఆర్డర్ సమస్య తీవ్రంగా వేధించింది. శ్రేయాస్ అయ్యర్ ఈ వన్డే సిరీస్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు...

రెండో వన్డేలో 85 పరుగులు చేసి, మెరిసిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, మొదటి, మూడో వన్డేల్లో ఫెయిల్ అయ్యాడు... మూడో వన్డేలో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...

వెంకటేశ్ అయ్యర్ రెండు వన్డేల్లో అవకాశం ఇచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. లోయర్ ఆర్డర్‌లో శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్... మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కంటే మెరుగ్గా పరుగులు సాధించారు...

కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా విఫలం కావడానికి అతని స్వార్థమే కారణమంటున్నారు విశ్లేషకులు. కెఎల్ రాహుల్ మూడు వన్డేల్లోనూ ఓపెనర్‌గానే వచ్చాడు...

ఐపీఎల్ 2021 టోర్నీలో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లోనూ అదరగొట్టాడు. అయినా అతనికి తుదిజట్టులో అవకాశం రాలేదు...

మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌కి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి, కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే... టీమిండియా సమస్య చాలా వరకు తగ్గేది...

అయితే రెండో వన్డేలో 55 పరుగులు చేయడం మినహా మిగిలిన రెండు వన్డేల్లో బ్యాటర్‌గానూ విఫలమైన కెఎల్ రాహుల్, తన ఓపెనింగ్ ప్లేస్‌ని రుతురాజ్ గైక్వాడ్‌కి ఇవ్వడానికి ఇష్టపడలేదు...

కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న సమయంలోనే బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దిగజారి... సురేష్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి యంగ్ ప్లేయర్లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చాడు ఎమ్మెస్ ధోనీ...

జట్టు ప్రయోజనాల కోసం తన సొంత రికార్డులను, తన బ్యాటింగ్ స్థానాన్ని కూడా మిగిలిన ప్లేయర్ల కోసం వదులుకున్నాడు...

ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలవమే ముఖ్యమన్నట్టుగా బ్యాటింగ్ చేసే కెఎల్ రాహుల్, టీమిండియాలోనే తాను ఎక్కువ పరుగులు చేయడమే ముఖ్యమన్నట్టు వ్యవహరించడం భారత జట్టును దెబ్బతీసిందంటున్నారు విశ్లేషకులు...

click me!