రోహిత్ శర్మకే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు... కెఎల్ రాహుల్‌ని తప్పించి, రిషబ్ పంత్‌కి వైస్ కెప్టెన్సీ ఇచ్చే...

First Published Jan 25, 2022, 12:42 PM IST

సౌతాఫ్రికా టూర్ ఆరంభానికి ముందు భారత జట్టు టెస్టుల్లో నెం.1 టీమ్‌గా ఉంది. న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది... టెస్టు సిరీస్ కూడా గెలిచి ఆ జోష్‌లో సఫారీ గడ్డపై అడుగుపెట్టింది...

సౌతాఫ్రికా టూర్‌‌కి ముందు టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో భారత క్రికెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి...

71 శాతం విజయాలతో టాప్‌లో ఉన్న కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో బాగా హర్ట్ అయిన విరాట్... టెస్టు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించేశాడు...

68 టెస్టుల్లో 40 టెస్టు విజయాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, కేప్ టౌన్ టెస్టు పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

దీంతో టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, ఛతేశ్వర్ పూజారాల పేర్లు, టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్నట్టు వార్తలు వినిపించాయి...

‘రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటే, టెస్టు కెప్టెన్సీ కూడా అతనికే ఇస్తే బెటర్. సౌతాఫ్రికా సిరీస్‌కి అతను వైస్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు, గాయం కారణంగా తప్పుకున్నాడు... 

గాయం కాకపోయి ఉంటే, జోహన్‌బర్గ్ టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించేవాడు కదా. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్, కెప్టెన్ అయ్యేందుకు పూర్తి అర్హుడు...

అయితే అతని ఫిట్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవాలి. అతనికి ఎంతో అనుభవం ఉంది... 

అయితే ఈ వయసులో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని, ఆ ప్రెషర్‌ని మేనేజ్ చేయగలడా? అనేది పరిగణనలోకి తీసుకోవాలి...

రిషబ్ పంత్ ఓ అద్భుతమైన ప్లేయర్. ఓ కోచ్‌గా అతనిలో చాలా టాలెంట్ గమనించాను. అతని యాటిట్యూడ్ కూడా జట్టుకి ఉపయోగపడుతుంది...

రిషబ్ పంత్‌ ఆటను అర్థం చేసుకోగలడు, జట్టుకి అవసరమైనట్టుగా తనని తాను మలుచుకోగలడు... కాబట్టి రోహిత్ కాకపోతే రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇస్తే బెటర్... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ కోచ్ రవిశాస్త్రి...

సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా విఫలమైన కెఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి... ఆ బాధ్యతను రిషబ్ పంత్‌కి అప్పగిస్తే ఫ్యూచర్‌లో సారథ్య బాధ్యతలు అప్పగించడానికి వీలవుతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!