మహేంద్ర సింగ్ ధోనీకి షాక్ ఇచ్చిన ట్విట్టర్... అధికారిక టిక్ మార్క్ తొలగింపు, ఫ్యాన్స్ డిమాండ్‌తో...

First Published Aug 6, 2021, 3:58 PM IST

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్ ఫ్యాన్స్‌లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ... మాస్ జనాల్లో మాహీ ఫాలోయింగ్‌యే వేరు... సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో ధోనీ కూడా ఒకడు...

ట్విట్టర్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి 8.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే మాహీ ఖాతాకు ఉండే అధికారిక టిక్ మార్కును తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ట్విట్టర్...

మాహీ ఖాతాకి ఉన్న టిక్ మార్కు తొలగించడానికి కారణం అతను ట్విట్టర్‌లో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉండడమే... చివరిసారిగా జూన్ 8న ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ... అంతకుముందు కూడా నెలకో, రెండు నెలలకో ఓ ట్వీట్ వేసేవాడు ధోనీ...

వాస్తవానికి కెరీర్ ఆరంభంలో ధోనీ ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉండేవాడు. నవంబర్ 2009లో ట్విట్టర్ ఖాతా తెరిచిన మహేంద్ర సింగ్ ధోనీ, అన్ని విషయాల గురించి ట్వీట్లు కూడా చేసేవాడు...

మాహీ పోస్టు చేసిన ఓ ఫోటోపై ‘ఇలాంటి ఫోజులు ఆపి, బ్యాటింగ్‌పై ఫోకస్ చేయి’ అంటూ మాహీని ట్రోల్ చేయబోయిన ఓ అభిమానికి, ధోనీ ఇచ్చిన రిప్లై అప్పట్లో చాలా వైరల్ అయ్యింది... ‘సర్... సర్... ఎనీ టిప్స్ సర్’ అంటూ వ్యంగ్యంగా మాహీ ఇచ్చిన రిప్లై ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది...

అయితే 2015 వన్డే వరల్డ్‌కప్ తర్వాతి నుంచి మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది... ఐపీఎల్‌లో అదరగొడుతూ, టీమిండియాలో మాత్రం బ్యాటింగ్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడంటూ మాహీని తీవ్రంగా విమర్శించడం మొదలెట్టారు క్రికెట్ ఫ్యాన్స్...

మిగిలిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే ట్విట్టర్‌లో ఈ ట్రోలింగ్ బీభత్సంగా ఉంటుంది. ఈ ట్రోలింగ్‌‌ను ఫేస్ చేయడం ఇష్టం లేకనే, మాహీ ట్విట్టర్‌కి ఉంటున్నాడు...

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో యాక్టీవ్‌గా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ... ఇన్‌స్టాలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటాడు. ఫేస్‌బుక్‌ను అయితే కేవలం ప్రమోషనల్ పోస్టుల గురించే ఉపయోగిస్తూ ఉంటాడు...

గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించి, చారిత్రక విజయం సాధించిన టీమిండియా గురించి మహేంద్ర సింగ్ ధోనీ ఒక్క పోస్టు చేయకపోవడం చాలా హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో మాహీ ఓ ప్రమోషనల్ పోస్టు వేయడం మరింత రచ్చ లేసింది...

మాహీ సతీమణి సాక్షి సింగ్, కూతురు జీవా సింగ్‌లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వారికి ప్రత్యేక ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరూ నిత్యం తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటే, మాహీ మాత్రం మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన తర్వాత ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఈ ఏడాది సీజన్ ముగిసిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకుంటాడని టాక్ వినబడుతోంది...

అధికారిక టిక్ మార్కు తొలగించిన తర్వాత ధోనీ అభిమానుల నుంచి తీవ్రమైన స్పందన రావడంతో వెంటనే స్పందించిన ట్విట్టర్, తిరిగి టిక్ మార్కును జత చేసింది...

click me!