ఒక్క బంతి, రెండు బంతులు పడగానే... తొలి టెస్టులో రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం...

First Published Aug 5, 2021, 10:12 PM IST

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు, ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లోనూ ప్రత్యక్షమయ్యాడు. మొదటి రోజు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ సాగగా, రెండో రోజు పూర్తి ఆట సాధ్యం కాలేదు... 46.4 ఓవర్లలో 125/4 వద్ద ఉన్న సమయంలో ఆట సాధ్యం కాకపోవడంతో రెండో రోజు ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. 

రెండో సెషన్‌లో వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి, టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో వెలుతురు సరిగా లేని కారణంగా ఆటను నిలిపివేశారు అంపైర్లు. ఆ తర్వాత కొద్దిసేపటికే వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. 

కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగడంతో తిరిగి ఆటను ప్రారంభించారు. అయితే అండర్సన్ ఒక్కటంటే ఒక్క బాల్ వేయకుండా, మళ్లీ వర్షం మొదలైంది. దీంతో మళ్లీ మ్యాచ్‌ నిలిచింది.

ఆ తర్వాత మరికొంత సమయం తర్వాత వర్షం నిలిచి, వాతావరణం అనుకూలంగా మారడంతో తిరిగి ఆట ప్రారంభమైంది. అయితే ఈసారి అండర్సన్ రెండు బంతులు వేయగానే వర్షం మొదలైంది...

వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి 46.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది టీమిండియా. ఓపెనర్ కెఎల్ రాహుల్ 151 బంతుల్లో 9 ఫోర్లతో 57 పరుగులు, రిషబ్ పంత్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

107 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి రాబిన్ సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తొలి వికెట్‌‌కి 97 పరుగులు జోడించిన రోహిత్, లంచ్ బ్రేక్‌కి ముందు భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

లంచ్ బ్రేక్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛతేశ్వర్ పూజారా 16 బంతుల్లో 4 పరుగులు చేసి, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాతి బంతికే కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. నాలుగో వికెట్‌కి 8 పరుగులు జోడించిన అజింకా రహానే లేని పరుగు కోసం ప్రయత్నించి, బెయిర్ స్టో డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు.

ఒకానొకదశలో 97/0 స్కోరుతో పటిష్టంగా కనిపించిన టీమిండియా, 15 పరుగుల తేడాతో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 112/4 వద్దకు చేరుకుంది. క్రీజులో ఉన్న కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ రాణించడాన్ని బట్టే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. 

click me!