అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన జేమ్స్ అండర్సన్... తొమ్మిదోసారి కోహ్లీని...

First Published Aug 5, 2021, 8:38 PM IST

ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చాడు. పూజారాను అవుట్ చేసిన అండర్సన్, ఆ తర్వాతి బంతికే విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు...

కోహ్లీ వికెట్‌తో టెస్టుల్లో 619 వికెట్లు పూర్తిచేసుకున్న జేమ్స్ అండర్సన్, భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. టాప్ 3లో ఉన్న ఏకైక ఫాస్ట్ బౌలర్ కూడా జేమ్స్ అండర్సన్ కావడం విశేషం...

లంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 టెస్టు వికెట్లతో టాప్‌లో ఉండగా, ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అండర్సన్ మరో వికెట్ తీస్తే, అనిల్ కుంబ్లేను అధిగమిస్తాడు. 

సచిన్ టెండూల్కర్‌ను 12 సార్లు అవుట్ చేసిన అండర్సన్, ఎమ్మెస్ ధోనీని 10సార్లు, విరాట్ కోహ్లీని 9 సార్లు పెవిలియన్‌కి చేర్చాడు... టెస్టుల్లో అండర్సన్ బౌలింగ్ అవుట్ కావడం కోహ్లీకిది ఆరోసారి... 

2014లో చివరిసారి విరాట్ కోహ్లీని అవుట్ చేసిన జేమ్స్ అండర్సన్, 12 టెస్టుల తర్వాత మళ్లీ భారత కెప్టెన్‌ వికెట్ పడగొట్టాడు. కోహ్లీ సెంచరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశే ఎదురైంది...

తొలి టెస్టులో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో మూడుసార్లు మొదటి బంతికే డకౌట్ అయిన భారత సారథిగా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్‌పై 2018లో, 2019లో వెస్టిండీస్‌పై డకౌట్ అయ్యాడు..

లేని పరుగు కోసం ప్రయత్నించి, రనౌట్ అయిన అజింకా రహానే... గత 16 ఇన్నింగ్స్‌ల్లో ఇలా పెవిలియన్ చేరడం రెండోసారి. తన మొదటి 110 ఇన్నింగ్స్‌ల్లో రనౌట్ కాని, ఆ తర్వాత రెండుసార్లు రనౌట్ కావడం విశేషం...

Virat Kohli

టెస్టుల్లో 9వ సారి డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించాడు. ధోనీ తన కెరీర్‌లో 60 టెస్టుల్లో 8సార్లు డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ 9వ సారి డకౌట్ అయ్యాడు... పకౌడీ 7సార్లు డకౌట్ అయ్యి, మూడో స్థానంలో ఉన్నాడు.

click me!