వాళ్లిద్దరూ ఆడకపోతే అంతే! టీవీలు కట్టేస్తారు... విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలపై ఇంగ్లాండ్ క్రికెటర్...

First Published Oct 2, 2022, 3:13 PM IST

భారతీయులకు ఆవేశం, అభిమానం రెండూ ఎక్కువే. ఆవేశం వస్తే ఆగ్రహాంతో ఊగిపోయే జనాలు, అభిమానిస్తే మాత్రం హీరోయిన్లకు కూడా గుళ్లు కట్టేస్తారు. అలా విశేష జనాదరణ సంపాదించిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ముందుంటారు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో జనాలపై ప్రభావం చూపించారు కోహ్లీ, ధోనీ...

విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 20 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీకి బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ప్రాంతాల్లోనూ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమానులు ఉన్నారు...

‘విరాట్ కోహ్లీ బాగా ఆడితే టీమిండియా విజయాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే  భారత్‌లో జనాలు విరాట్ కోహ్లీ ఆడితే చూడడానికి బాగా ఇష్టపడతారు. నేను టీవీలో పనిచేశాను. టీవీ రేటింగ్స్‌ని విరాట్ కోహ్లీ ప్రభావితం చేస్తాడు...

ఎంఎస్ ధోనీ కానీ విరాట్ కోహ్లీ కానీ బాగా ఆడితే అక్కడ టీఆర్పీ రేటింగ్ బాగావస్తుంది. అందరూ టీవీలకు అత్తుకుపోతారు. అయితే ఒక్కసారి వీళ్లిద్దరూ అవుట్ అయితే చాలు, చాలా టీవీలు ఆఫ్ అయిపోతాయి. మ్యాచ్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా టీవీలను కట్ చేసేస్తారు...

అందుకే విరాట్ కోహ్లీ బాగా ఆడాలని నేను కోరుకునేవాడిని. నేను టీమిండియాకి ప్రత్యర్థిగా ఆడినప్పుడు కూడా అతను త్వరగా అవుట్ అవ్వాలని అనుకునేవాడిని కాదు. ఎందుకంటే అతను ఆడుతుంటే చూడడం నాక్కూడా ఇష్టమే...

Image credit: PTI

టీవీల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడం చాలా మందికి నచ్చుతుంది. అయితే స్టేడియంలో, అదీ క్రీజులో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో లేదా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గమనిస్తే... ఓ అద్భుతమైన పెయింటింగ్‌లా ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్, క్రికెట్ కామెంటేటర్ గ్రేమ్ స్వాన్... 

click me!