జస్ప్రిత్ బుమ్రా గాయంపై పూటకో పుకారు... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడడం ఖాయమంటూ...

First Published Oct 2, 2022, 12:27 PM IST

జస్ప్రిత్ బుమ్రా... టీమిండియాకి మూడు ఫార్మాట్లలో కీ బౌలర్. ప్రస్తుతం మూడు ఫార్మాట్లు ఆడుతున్న ఏకైక భారత ఫాస్ట్ బౌలర్ కూడా. జస్ప్రిత్ బుమ్రా లేకపోవడం వల్లే ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా ఓడిందనేది చాలామంది అభిప్రాయం. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడనే వార్త రావడంతో భారత ఫ్యాన్స్ షాక్ అయ్యారు...

భువనేశ్వర్ కుమార్ సరైన ఫామ్‌లో లేడు, గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత మహ్మద్ షమీ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఆవేశ్ ఖాన్ అదరగొట్టలేకపోయాడు. హర్షల్ పటేల్ కూడా గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చాడు...

ఇన్ని సమస్యల మధ్య ఎన్నో హోప్స్ పెట్టుకున్న జస్ప్రిత్ బుమ్రా గాయపడి, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడనే వార్త రావడంతో ఇక భారత జట్టు టైటిల్ గెలిచినట్టే! అని డిసైడ్ అయ్యారు. బుమ్రా, జడ్డూ లేకుండా టీమిండియా టైటిల్ ఫెవరెట్ కాదని తేల్చేశారు...

Image credit: Getty

అయితే జస్ప్రిత్ బుమ్రా ఇంకా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పూర్తిగా దూరం కాలేదని కామెంట్లు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేశాడు. బుమ్రా, పొట్టి ప్రపంచకప్ ఆడతాడనే ఆశలు ఉన్నాయని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్ చేశాడు...

Image credit: Getty

తాజాగా జస్ప్రిత్ బుమ్రా గాయంపై మరోవార్త ప్రచారంలోకి వచ్చింది. జస్ప్రిత్ బుమ్రా వెన్నెముకకి ఫ్రాక్చర్ అయ్యిందని, అది మానడానికి నాలుగైదు నెలల సమయం పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే అది ఫ్రాక్చర్ కాదని, కేవలం స్ట్రెస్ రియాక్షన్ మాత్రమేనని బీసీసీఐ అధికారులు తెలియచేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది...

bumrah

స్ట్రైస్ ఫ్రాక్చర్ అయితే నాలుగు నుంచి ఆరు నెలల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరిగి బౌలింగ్ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇంతకుముందు హార్ధిక్ పాండ్యా విషయంలో జరిగింది ఇదే. 2018 ఆసియా కప్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా, రెండేళ్ల పాటు బౌలింగ్ వేయలేకపోయాడు...

Image credit: Getty

అయితే జస్ప్రిత్ బుమ్రాకి ఒత్తిడితో వెన్నునొప్పి వచ్చిందని, ఇది 4 నుంచి 6 వారాల విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని సమాచారం. ఇదే నిజమైతే ఇప్పటికే దాదాపు వారం రోజులకు పైగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా, పాకిస్తాన్‌తో జరిగే మొదటి మ్యాచ్‌కి దూరమైనా ఆ తర్వాత టీమ్‌తో కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...
 

అక్టోబర్ 5న ముంబై నుంచి టీ20 వరల్డ్ కప్ 2022 కోసం పెర్త్ బయలుదేరి వెళ్లనుంది టీమిండియా. జస్ప్రిత్ బుమ్రా ఈ జట్టుతో వెళ్తాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రాలేదు. అయితే బుమ్రా గాయాన్ని అక్టోబర్ 15 వరకూ సమీక్షించనుంది బీసీసీఐ...

అక్టోబర్ 16న టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఫైనల్ జట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సమయానికి జస్ప్రిత్ బుమ్రా కోలుకోకపోతే అతని ప్లేస్‌లో ఎవరిని ఆడించాలనేది నిర్ణయం తీసుకుంటారు. ముందుజాగ్రత్తగా మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్‌లను నెట్ బౌలర్లుగా ఆస్ట్రేలియా తీసుకెళ్తోంది టీమిండియా...

click me!