ఏడు సీజన్లకోసారి వరల్డ్ కప్ కొడుతున్న టీమిండియా... ధోనీకి వర్కవుట్ అయ్యింది, రోహిత్‌కి కలిసొస్తే...

First Published Oct 2, 2022, 1:45 PM IST

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. జెర్సీ రంగు, జెర్సీ కలర్ దగ్గర్నుంచి ఫలానా అంపైర్ ఉంటే టీమిండియా మ్యాచ్ గెలుస్తుందని, ఫలానా రోజున ఆడితే మ్యాచ్ మనదేనని ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటూ ఉంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2022కి ఇలాంటి సెంటిమెంట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది భారత జట్టు. అండర్ డాగ్స్‌గా బరిలో దిగి అంచనాలకు మించి రాణించి, అప్పటి వరల్డ్ ఛాంపియన్‌ని వెస్టిండీస్‌ని ఫైనల్‌లో చిత్తు చేసి మొట్టమొదటి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ విజయం భారత క్రికెట్ దశను మలుపు తిప్పింది...

1983 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత 1987, 1992, 1996, 1999, 2003, 2007 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయింది. 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...

అంటే 1983 తర్వాత వరుసగా ఆరు సీజన్లలో టైటిల్ సాధించలేకపోయిన టీమిండియా, 2011లో మళ్లీ వన్డే వరల్డ్ కప్ సాధించింది. మొదటి వన్డే వరల్డ్ కప్ తర్వాత ఏడు సీజన్లకు రెండో వరల్డ్ కప్ గెలిచింది భారత జట్టు...

2007 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగి పాకిస్తాన్‌ని ఫైనల్‌లో ఓడించి ఉత్కంఠ విజయం అందుకుంది టీమిండియా. ఈ విజయం తర్వాత 2009, 2010, 2012, 2014, 2016, 2021 సీజన్లలో టీమిండియా టైటిల్ ఆశలు నెరవేరలేదు...

Image credit: PTI

2014 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినా పాకిస్తాన్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది భారత జట్టు. మళ్లీ మొదటి టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఏడు సీజన్లకు 2022 వరల్డ్ కప్ ఆడబోతోంది టీమిండియా. మొదటి వన్డే వరల్డ్ కప్ తర్వాత ఏడు సీజన్లకు రెండో వరల్డ్ కప్ దక్కినట్టు... టీ20 వరల్డ్ కప్ విషయంలోనూ జరుగుతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ విషయంలో జరిగినట్టే టీ20 వరల్డ్ కప్ విషయంలోనూ ఏడు సీజన్లలకు మధ్య ఓ సారి టీమిండియా ఫైనల్ చేరింది, అయితే టైటిల్ గెలవలేకపోయింది... 2011 వన్డే వరల్డ్ కప్‌కి ముందు 2007 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగి గ్రూప్ స్టేజీకే పరిమితమై... ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.

Image credit: PTI

అలాగే 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు, పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజీ దాటలేకపోయింది. ఇవన్నీ సెంటిమెంట్స్‌ ఈసారి రోహిత్ సేన విజయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు కొందరు అభిమానులు. అయితే ఈ వన్డే వరల్డ్ కప్ విషయంలో కెప్టెన్ ధోనీ జెర్సీ నెంబర్ 7...

మహేంద్ర సింగ్ ధోనీ లక్కీ నెంబర్ 7 కావడంతో కరెక్టుగా 1983 తర్వాత ఏడు సీజన్లకు కెప్టెన్‌గా వన్డే వరల్డ్ కప్ గెలిచాడని, ఆ లెక్కన రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45... 4+5=9 కాబట్టి కెప్టెన్‌గా టైటిల్ గెలవాలంటే ఇంకో రెండు సీజన్లు వేయి చూడాలనేవాళ్లు లేకపోలేదు.. 

click me!