ఐసిసి టీ20 ప్రపంచకప్ అభిమానులకు ఎన్నో మరపురాని క్షణాలను అందించింది. కీలక విజయాల నుంచి రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్‌ల వరకు ఈ మెగా ఈవెంట్ లో అనేక అద్భుతాలు జరిగాయి. అలాంటివాటి గురించి తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2026కి ఇంకా మూడు రోజులే ఉంది. మొత్తం 20 జట్లు 30 రోజుల పాటు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం పోటీపడతాయి. ఇది ఫిబ్రవరి 7న మొదలవుతుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 2024లో టైటిల్ గెలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.
గత రెండు దశాబ్దాలుగా టీ20 ప్రపంచకప్ అద్భుతమైన విజయాలు, రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లతో ఎన్నో ఐకానిక్, మరపురాని క్షణాలను చూసింది. ఈ మెగా ఈవెంట్ 10వ ఎడిషన్‌లోకి అడుగుపెడుతోంది... ఇది టోర్నమెంట్ తొలి ఎడిషన్ నుంచి టీ20 క్రికెట్ పరిణామాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలుగా టీ20 ప్రపంచకప్‌ను తీర్చిదిద్దిన టాప్ ఐకానిక్ క్షణాలను ఓసారి చూద్దాం.
29
1. 2007 ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత విజయం
2007 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో జోగిందర్ శర్మ పాక్ క్రికెటర్ మిస్బా-ఉల్-హక్‌ను ఔట్ చేసి 5 పరుగుల తేడాతో గెలిపించాడు... శ్రీశాంత్ క్యాచ్ అద్భుతమనే చెప్పాలి. ఇది ఇండియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించాడు.
39
2. యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా నెలకొల్పాడు.
2010 సెమీ ఫైనల్లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మైఖేల్ హస్సీ అద్భుతం చేశాడు. చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఆస్ట్రేలియాకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు.
59
4. 2016 ఫైనల్లో కార్లోస్ బ్రాత్‌వైట్ హీరోయిజం
2016 ఫైనల్లో ఇంగ్లండ్‌పై కార్లోస్ బ్రాత్‌వైట్ అద్భుతం చేశాడు. చివరి ఓవర్‌లో 19 పరుగులు అవసరం కాగా బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌కు కప్ అందించాడు.
69
5. 2016లో బంగ్లాదేశ్‌పై ధోనీ స్ప్రింట్
2016లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ అద్భుతం చేశాడు. చివరి బంతికి రనౌట్ అవసరం కాగా గ్లోవ్ తీసి వికెట్ల వైపు స్ప్రింట్ చేసి ముస్తాఫిజుర్‌ను రనౌట్ చేసి ఒక్క పరుగుతో గెలిపించాడు.
79
6. 2022లో విరాట్ కోహ్లీ MCG మాస్టర్‌క్లాస్
2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 160 పరుగుల ఛేదనలో 53 బంతుల్లో 82* పరుగులు చేసి భారత్‌కు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ ఐకానిక్.
89
7. 2022 ఫైనల్లో బెన్ స్టోక్స్ అద్భుతం
2016 ఫైనల్ ఓటమికి ప్రతీకారంగా 2022 ఫైనల్లో బెన్ స్టోక్స్ అద్భుతంగా ఆడాడు. పాకిస్థాన్‌పై 52* పరుగులు చేసి ఇంగ్లండ్‌కు రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు.
99
8. 2024 ఫైనల్లో సూర్యకుమార్ గేమ్-ఛేంజింగ్ క్యాచ్
2024 ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ గేమ్-ఛేంజర్. చివరి ఓవర్‌లో బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ పట్టి, దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ ఆశలను కూల్చి భారత్‌కు కప్ అందించాడు.