IPL Auction
1. యష్ ధుల్
అండర్ 19 ప్రపంచ కప్ 2022లో భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరించిన యంగ్ ప్లేయర్ యష్ ధుల్ 2025 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోలేదు. ధుల్ నవంబర్ 11, 2002లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడతాడు. అతను 2021–22 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. తన ప్రారంభ రోజున రెండు సెంచరీలు చేశాడు. 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, 2021 ACC అండర్-19 ఆసియా కప్‌లో భారతదేశ విజేత జట్టుకు కెప్టెన్‌గా యష్ ధుల్ ఉన్నాడు.
Image credit: PTI
2. శివమ్ మావీ
శివమ్ మావి అండర్ 19 ప్రపంచ కప్ 2018 భారత జట్టులో భాగమయ్యాడు కానీ అతను ఐపీఎల్ 2025 మెగా వేలం లో అమ్ముడుపోలేదు. ఇంతకుముందు అతను ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడాడు. 140+ వేగంలో బంతులు వేయగల శివమ్ మావీ గాయం కారణంగా కొంత కాలం క్రికెట్ కు దూరమయ్యాయాడు.
Alzarri Joseph
3. అల్జారీ జోసెఫ్
అల్జారీ జోసెఫ్ 2016లో వెస్టిండీస్ అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు కానీ 2025 ఐపీఎల్ మెగా వేలంలో అతను అమ్ముడుపోలేదు. అల్జారీ జోసెఫ్ ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం 2 కోట్ల బేస్ ధర వద్ద నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చివరి సీజన్‌లో వెస్టిండీస్ పేసర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. రైట్ ఆర్మ్ పేసర్ ఐపీఎల్ ప్రయాణం 2019లో ముంబై ఇండియన్స్‌తో ప్రారంభమైంది.
4. హార్విక్ దేశాయ్
హార్విక్ దేశాయ్ 2018లో భారత అండర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమయ్యాడు కానీ IPL వేలం 2025లో అమ్ముడుపోలేదు. ఐపీఎల్ 2024 లో అతను ముంబై ఇండియన్స్ టీమ్ లో భాగంగా ఉన్నాడు.
Prithvi Shaw, IPL 2024,
5. పృథ్వీ షా
అండర్ 19 ప్రపంచ కప్ 2018 గెలిచిన భారత జట్టుకు పృథ్వీ షా కెప్టెన్‌గా ఉన్నాడు, కానీ ఐపీఎల్ వేలం 2025లో అమ్ముడుపోలేదు. భారత సీనియర్ జట్టు తరఫున కూడా అతను అద్భుతమైన అనేక ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే, వరుస వివాదాలు, ఫిట్ నెట్ లేమితో జట్టుకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ కు కూడా దూరం అయ్యాడు.