IPL Top 5 Trades: ఐపీఎల్ చరిత్రనే మార్చేసిన 5 క్రేజీ ట్రేడ్స్.. సంజూ, హార్దిక్ డీల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Nov 12, 2026, 10:13 AM IST

IPL Top 5 Trades: ఐపీఎల్ చరిత్రలో జట్ల తలరాత మార్చిన టాప్ సక్సెస్‌ఫుల్ ట్రేడ్స్ కొన్ని ఉన్నాయి. సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, క్వింటన్ డి కాక్ వంటి స్టార్ ఆటగాళ్ల ట్రేడ్ రికార్డులు సహా ఐపీఎల్ లో టాప్ 5 సక్సెస్‌ఫుల్ ట్రేడ్స్ వివరాలు మీకోసం.

PREV
16
ఐపీఎల్‌లో మైండ్ బ్లోయింగ్ స్వాప్ డీల్స్.. ముంబై, చెన్నై మాస్టర్ ప్లాన్స్ మామూలుగా లేవుగా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో రికార్డు స్థాయి ట్రేడ్స్, ఊహించని మార్పులు జరిగాయి. ఒక ఫ్రాంచైజీ భవిష్యత్తును మార్చడంలో ప్లేయర్ ట్రేడ్స్ ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంటాయి. కొన్ని ట్రేడ్స్ వల్ల జట్లు బలమైన స్క్వాడ్స్‌ను నిర్మించుకోగలిగితే, మరికొన్ని ఆటగాళ్ల కెరీర్‌నే పూర్తిగా మార్చేశాయి. ఐపీఎల్‌లో జరిగిన పలు రికార్డు ట్రేడ్స్ ఆయా జట్లకు, ఆటగాళ్లకు ఎంతో మేలు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రదర్శన ఆధారంగా ఐపీఎల్ చరిత్రలోనే టాప్-5 మోస్ట్ సక్సెస్‌ఫుల్ ట్రేడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

26
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ శాంసన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ ₹18 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులోకి ట్రేడ్ అయ్యాడు. ఈ డీల్‌లో భాగంగా సీఎస్కే స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మారారు. ఎన్నో ఏళ్లుగా జట్టుకు సేవలందించిన జడేజాను వదులుకోవడం సీఎస్కే మేనేజ్‌మెంట్ తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం.

కానీ, టాప్ ఆర్డర్‌లో సంజూ చేరడం వల్ల చెన్నై జట్టుకు ఒక కొత్త బలం వచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు కొన్ని వారాల ముందే జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు గెలుచుకున్నాడు. అదే సూపర్ ఫామ్‌ను ఐపీఎల్ 2026లోనూ కొనసాగిస్తూ 14 మ్యాచ్‌ల్లో 165 స్ట్రైక్ రేట్‌తో 477 పరుగులు చేశాడు. ఇందులో రెండు అద్భుతమైన సెంచరీలు కూడా ఉన్నాయి. సంజూ తన బ్యాటింగ్‌తో జట్టుకు పలు విజయాలు అందించినప్పటికీ, సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

36
పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఒక భారీ స్వాప్ డీల్ జరిగింది. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టులో చేరగా, అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ (MI) గూటికి చేరనున్నాడు. ఇద్దరు ఆటగాళ్ల అంగీకారంతో పంజాబ్, ముంబై ఫ్రాంచైజీలు కొద్ది రోజుల క్రితం బీసీసీఐకి అవసరమైన పత్రాలను సమర్పించాయి. దీనిపై ఐపీఎల్ నవంబర్ 11న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ ట్రేడ్ రెండు జట్ల బౌలింగ్, ఆల్‌రౌండ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి అర్ష్‌దీప్ సింగ్ పేస్ అటాక్‌ను మరింత పదును పెట్టనున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా రాకతో ఆల్‌రౌండర్ల పరంగా పంజాబ్ కింగ్స్ అత్యంత బలమైన జట్టుగా మారనుంది. ఇప్పటివరకు ఒక సరైన భారత ఆల్‌రౌండర్ లేక ఇబ్బంది పడిన పంజాబ్, ఈ డీల్‌తో ఆ లోటును పూర్తిగా భర్తీ చేసుకుంది.

46
ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హర్షల్ పటేల్

ఐపీఎల్ ప్రదర్శన పరంగా చూస్తే అత్యుత్తమ ట్రేడ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తీసుకున్న నిర్ణయం ఒకటి. ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి డేనియల్ సామ్స్‌తో పాటు హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ ట్రేడ్ చేసుకుంది. ఆ సీజన్‌లో హర్షల్ పటేల్ తన కెరీర్‌లోనే పీక్ ఫామ్‌ను అందుకున్నాడు.

14 సగటు, 8.14 ఎకానమీ రేటుతో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆల్‌టైమ్ రికార్డును సమం చేయడమే కాకుండా, ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్‌లో కూడా హర్షల్ తన జోరు కొనసాగిస్తూ కేవలం 7.66 ఎకానమీ రేటుతో 19 వికెట్లు తీసి జట్టుకు తన విలువ ఏంటో నిరూపించాడు.

56
ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్ బౌల్ట్

ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నుంచి న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ముంబై ఇండియన్స్ ఆల్-క్యాష్ డీల్ ద్వారా సొంతం చేసుకుంది. అంతకుముందు 2019 సీజన్‌లో బౌల్ట్ కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ముంబై జట్టులోకి అడుగుపెట్టగానే అతను అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు.

18.28 సగటు, 7.97 ఎకానమీ రేటుతో 25 వికెట్లు పడగొట్టి ముంబై తన టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీసే బౌల్ట్ సామర్థ్యం ముంబైకి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చింది. మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌల్ట్ చెలరేగడంతో ముంబై ఇండియన్స్ మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

66
ఐపీఎల్ 2019లో ముంబై ఇండియన్స్‌కు క్వింటన్ డి కాక్

ముంబై ఇండియన్స్ చేసుకున్న మరో సూపర్ డీల్ క్వింటన్ డి కాక్ ట్రేడ్. ఐపీఎల్ 2019 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఆల్ క్యాష్ డీల్ ద్వారా డి కాక్‌ను ముంబై కొనుగోలు చేసింది. జట్టులోకి వచ్చిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి డి కాక్ విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా మారాడు.

2019 సీజన్‌లో 132 స్ట్రైక్ రేట్‌తో 529 పరుగులు చేసి, ముంబై నాలుగోసారి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్ (2020)లోనూ డి కాక్ అదే జోరును కొనసాగిస్తూ 140 స్ట్రైక్ రేట్‌తో 503 పరుగులు సాధించాడు. ఫలితంగా ముంబై వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి, ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రికార్డు స్థాయిలో ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

Read more Photos on
click me!

Recommended Stories