Who is Arjun Rajput: అండర్ 19 ఆసియా కప్‌లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ బాదాడు అర్జున్ రాజ్‌పుత్. ఈ 19 ఏళ్ల పంజాబ్ ఆల్‌రౌండర్ గురించిన వివరాలు మీకోసం.
ఏసీసీ పురుషుల అండర్ 19 ఆసియా కప్ 2026 గ్రూప్-ఏ పోరులో పాకిస్తాన్‌పై భారత జట్టు కష్టాల్లో పడిన వేళ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఆల్‌రౌండర్ అర్జున్ రాజ్‌పుత్ కళ్లు చెదిరే కౌంటర్ అటాకింగ్ సెంచరీతో మెరిసాడు. అల్ అమేరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైన చోట, తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన అర్జున్ ఎంతో ధైర్యంతో ఆడి పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్‌ను తిప్పికొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్ష్య రాజ్‌చందానీ నేతృత్వంలోని భారత జట్టు ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. పాకిస్తాన్ కొత్త బంతి బౌలర్ల ధాటికి భారత్ కేవలం 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పాక్ పేసర్లు వికెట్లు తీస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఐదో వికెట్‌కు క్రీజులోకి వచ్చిన అర్జున్ రాజ్‌పుత్ ఎంతమాత్రం తగ్గలేదు. కౌంటర్ అటాకింగ్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై తిరుగుబాటు చేశాడు. కేవలం 80 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
24
107 పరుగుల సంచలన ఇన్నింగ్స్.. మ్యాచ్‌లో భారత్ కంబ్యాక్
అర్జున్ రాజ్‌పుత్ ఒంటరి పోరాటం చేస్తూ 85 బంతుల్లో 107 పరుగులు సాధించి జట్టుకు భారీ రక్షణగా నిలిచాడు. మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో పాక్ బౌలర్లను పరుగులు పెట్టించాడు. రిజ్వానుల్లా బౌలింగ్‌లో ఫర్హాన్‌కు క్యాచ్ ఇచ్చి అర్జున్ 7వ వికెట్‌గా వెనుతిరిగే సరికి టీమిండియా సురక్షిత స్థితికి చేరుకుంది. మనాల్ చౌహాన్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన అర్జున్, ఒక్కసారిగా భారత ఇన్నింగ్స్ మోమెంటమ్‌ను మార్చేశాడు.
ఈ మ్యాచ్‌లో అర్జున్ హిట్టింగ్ చూసిన వ్యాఖ్యాతలు అతడిని టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్‌తో పోల్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడం, మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు కీలక సమయంలో ఆఫ్ స్పిన్‌తో వికెట్లు తీయడం అర్జున్ శైలి. సరిగ్గా యువరాజ్ సింగ్ తరహాలోనే మైదానంలో షాట్ల ఎంపిక, బౌండరీ బాదే సత్తా అర్జున్ సొంతం.
34
జలంధర్ నుంచి భారత అండర్ 19 జట్టు వరకు అర్జున్ జర్నీ
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అర్జున్ రాజ్‌పుత్ డొమెస్టిక్ క్రికెట్‌లో వరుస ప్రదర్శనలతో పైకి వచ్చాడు. కూచ్ బిహార్, వీనూ మాన్కడ్ ట్రోఫీలలో పంజాబ్ ఏజ్-గ్రూప్ జట్ తరఫున ఆడి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం షేర్-ఎ-పంజాబ్ టీ20 కప్‌లో లుధియానా లయన్స్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ మోహాలీపై 46 బంతుల్లోనే 78 పరుగులు బాది తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని చాటుకున్నాడు.
ఈ డొమెస్టిక్ ఫామ్‌తో భారత అండర్ 19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లలో స్పిన్‌ను సులువుగా ఎదుర్కొంటూ సింగిల్స్ తీయడం, ఇన్నింగ్స్ ఆఖర్లో గేర్ మార్చడంలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌తోనూ మెరుస్తున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 5.3 ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు.
భారత సీనియర్ క్రికెట్ జట్టులో ప్రస్తుతం లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ప్లస్ పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్ లోటు ఉంది. అర్జున్ రాజ్‌పుత్ సరిగ్గా ఈ ప్రొఫైల్‌కే సరిపోతాడు. మిడిల్ ఓవర్లలో క్రీజులో నిలదొక్కుకోవడమే కాకుండా భారీ షాట్లతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా అతడికి ఉంది.
మరో నెల రోజుల్లో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌పై ఒత్తిడిలో బాదిన ఈ సంచలన సెంచరీ అర్జున్ రాజ్‌పుత్‌ను వార్తల్లో నిలిపింది. ఈ తరహా ఇన్నింగ్స్ వల్ల రాబోయే ఐపీఎల్ ఆక్షన్‌లో అర్జున్‌పై ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.