IPL Top 5 Captains: ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే

Published : Nov 19, 2026, 07:08 AM IST

IPL Top 5 Captains: ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో భారత ప్లేయర్లు టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. టాప్ 5 ప్లేయర్ల లిస్టులో డేవిడ్ వార్నర్ ఒక్కరే విదేశీ ప్లేయర్ గా ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

PREV
16
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా టాప్ రన్ స్కోరర్లు వీళ్లే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కెప్టెన్సీ చేయడం అంటే మామూలు విషయం కాదు. జట్ల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అంచనాలు కూడా ఆకాశాన్ని తాకుతుంటాయి. ఒక్క సీజన్ తేడా కొట్టినా సరే, తర్వాతి సీజన్లో కెప్టెన్సీ పదవికే ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుంది.

ఇంతటి ఒత్తిడిని తట్టుకుంటూనే, కొందరు కెప్టెన్లు తమ జట్లకు ఎన్నో ట్రోఫీలు అందించారు. అదే సమయంలో బ్యాట్‌తోనూ దుమ్మురేపి తమ జట్లను ముందుండి నడిపించారు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

26
5. డేవిడ్ వార్నర్, 3356 పరుగులు

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఈ లిస్టులో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 83 ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్, మొత్తం 3,356 పరుగులు సాధించాడు. ఈ 83 మ్యాచ్‌లలో అతని బ్యాటింగ్ యావరేజ్ 45.35 కాగా, స్ట్రైక్ రేట్ 140.53 గా ఉంది. కెప్టెన్‌గా వార్నర్ ఒక సెంచరీ, 32 హాఫ్ సెంచరీలు బాదాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు సారథ్యం వహించాడు.

36
4. గౌతమ్ గంభీర్, 3518 పరుగులు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు 2012, 2014 సీజన్లలో రెండు టైటిళ్లు అందించిన ఘనత గౌతమ్ గంభీర్‌కు దక్కుతుంది. కేకేఆర్‌తో విడిపోయిన తర్వాత అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన గంభీర్, కెప్టెన్‌గా 127 ఇన్నింగ్స్‌లు ఆడి 3,518 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాటింగ్ సగటు 31.13 కాగా, స్ట్రైక్ రేట్ 122.79 గా నమోదైంది. గంభీర్ కెప్టెన్సీలో 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2012 ఎడిషన్‌లో కేకేఆర్ తరఫున చేసిన 93 పరుగులే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు.

46
3. రోహిత్ శర్మ, 3986 పరుగులు

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించాడు. 2013 నుంచి 2023 వరకు ముంబై జట్టును నడిపించిన రోహిత్, 157 ఇన్నింగ్స్‌లలో 3,986 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అతని యావరేజ్ 28.07 గా, స్ట్రైక్ రేట్ 129.37 గా ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 25 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కెప్టెన్‌గా రోహిత్ అత్యధిక స్కోరు 98 పరుగులు.

56
2. ఎంఎస్ ధోనీ, 4753 పరుగులు

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు (235 మ్యాచ్‌లు) ఆడిన రికార్డు ఎంఎస్ ధోనీ పేరుపై ఉంది. అయితే పరుగుల విషయానికి వస్తే ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. 2008 నుంచి 2025 వరకు చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ జట్లకు ధోనీ నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా 204 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ, 38.64 సగటుతో 4,753 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 137.05 గా ఉంది. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉండగా, నాటౌట్‌గా నిలిచిన 84 పరుగులే అతని అత్యధిక స్కోరు.

66
1. విరాట్ కోహ్లీ, 4994 పరుగులు

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతోనే ఉన్నాడు. 2013 నుంచి 2023 వరకు ఆర్సీబీకి కెప్టెన్‌గా పనిచేశాడు. ఆర్సీబీ సారథిగా 142 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ, ఏకంగా 4,994 పరుగులు కుప్పలుగా పోశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. కెప్టెన్‌గా కోహ్లీ యావరేజ్ 41.96 కాగా, స్ట్రైక్ రేట్ 133.31 గా ఉంది. అంతేకాదు, కెప్టెన్‌గా 5 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories