బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డుల జాబితా ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
1. బిసిసిఐ (BCCI) : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ మొత్తం సంపద 2.2 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో ఇది రూ. 20,840 కోట్లు. ఐపీఎల్, కమర్షియల్ పోర్ట్‌ఫోలియోల ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం వస్తోంది.
2. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) : సుమారు 79 మిలియన్ డాలర్ల (రూ. 674 కోట్లు) సంపదతో ఆస్ట్రేలియా క్రికెట్ రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్, బ్రాడ్కాస్ట్ పార్ట్నర్షిప్లు, బిగ్ బాష్ లీగ్ ద్వారా వీరికి ఆదాయం వస్తోంది.
3. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) : క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ వద్ద సుమారు 59 మిలియన్ డాలర్ల (రూ. 503 కోట్లు) ఆస్తి ఉంది. ప్రధానంగా అంతర్జాతీయ క్రికెట్, ది హండ్రెడ్ టోర్నీ, దేశవాళీ క్రికెట్ ద్వారా వీరు సంపాదిస్తున్నారు.
4. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) : మన దాయాదిదేశం పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ వద్ద సుమారు 55 మిలియన్ డాలర్ల (రూ. 469 కోట్లు) సంపద ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ ద్వారా వీరికి ఎక్కువ ఆదాయం వస్తోంది.
5. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) : సుమారు 51 మిలియన్ డాలర్ల (రూ. 469 కోట్లు) ఆస్తి బిసిబి వద్ద ఉంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ద్వారా వీరు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు.