India vs West Indies: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన 4వ టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఫలితాన్ని మార్చిన 5 కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత్ కొంపముంచిన ఆ పొరపాట్లు ఇవే.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా షాకింగ్ ఓటమి
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంay వెస్టిండీస్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా కీలక దశలో తడబడింది. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. అతను కేవలం 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి భారత్ విజయ అవకాశాలను దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడం భారత్ పతనానికి ప్రధాన కారణమైంది.
25
మిడిలార్డర్ వైఫల్యం.. బిగ్ టార్గెట్ ఒత్తిడి
248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలో అభిషేక్ శర్మ పర్వాలేదనిపించినా, మిడిలార్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు చేసి వెనుదిరిగారు. నితీష్ కుమార్ రెడ్డి (41 పరుగులు), తిలక్ వర్మ (43 పరుగులు) పోరాడినప్పటికీ, రన్ రేట్ ఒత్తిడి పెరిగిపోవడంతో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో వికెట్లు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో భారత్ లక్ష్యానికి దూరమైంది.
35
పవర్‌ప్లే తర్వాత నెమ్మదించిన రన్ రేట్
మొదటి ఆరు ఓవర్లలో టీమిండియా మంచి స్కోరు సాధించినా, మధ్య ఓవర్లలో వెస్టిండీస్ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో టీమిండియాను అడ్డుకున్నారు. గుడాకేష్ మూతీ, రోస్టన్ ఛేజ్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. బ్యాటర్లకు క్రీజులో కుదురుకునే అవకాశం ఇవ్వకుండా డాట్ బాల్స్ సంఖ్యను పెంచారు. ఈ దశలో పెరిగిన అవసరమైన రన్ రేట్ యువ బ్యాటర్లపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని తెచ్చింది.
మ్యాచ్ చివరి దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అర్ష్‌దీప్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీవ్రమైన గాయానికి గురయ్యాడు. షమర్ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతని ఎడమ చేతి బైసెప్స్‌కు తగలడంతో నొప్పితో అల్లాడిపోయాడు. ఫిజియో మైదానానికి వచ్చి చికిత్స అందించినప్పటికీ, అతను కొనసాగలేక రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇది భారత జట్టు విజయాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.
55
వెస్టిండీస్ అద్భుతమైన ఫీల్డింగ్, ప్లానింగ్
వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో అద్భుతమైన వ్యూహాలతో బరిలోకి దిగింది. కెప్టెన్ షాయ్ హోప్ చక్కని వ్యూహాత్మక మార్పులతో బౌలర్లను సద్వినియం చేసుకున్నాడు. రోవ్‌మన్ పావెల్ లాంటి ఆటగాళ్లు అవుట్‌ఫీల్డ్‌లో అద్భుతమైన క్యాచ్‌లు అందుకుంటూ భారత బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరి ఓవర్లలో ఒత్తిడిని జయించి విండీస్ బౌలర్లు కట్టడి చేయడంతో, భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది.