కోచ్ రవిశాస్త్రికి బీసీసీఐ ఎంత చెల్లిస్తోందో తెలుసా... అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న కోచ్‌లు వీరే...

First Published Jun 8, 2021, 9:50 AM IST

జట్టు విజయాల్లో కెప్టెన్‌కి ఎంత భాగముంటుందో, కోచ్‌కి అంతకంటే ఎక్కువే క్రెడిట్ దక్కుతుంది. అయితే భారత జట్టు విజయాల్లో హెడ్ కోచ్ రవిశాస్త్రికి దక్కుతున్న క్రెడిట్ తక్కువే అని చెప్పాలి. అయితే సక్సెస్‌లో భాగం ఇవ్వకపోయినా బీసీసీఐ నుంచి దండిగా డబ్బులు ముడుతున్నాయి కోచ్‌గారికి...  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న టాప్ 10 క్రికెట్ కోచ్‌లు వీరే...

టాప్ 10 జింబాబ్వే కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్: ఈ 21వ శతాబ్దంలో తొలిసారిగా వన్డే వరల్డ్‌కప్‌కి అర్హత సాధించలేకపోయింది జింబాబ్వే. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో జింబాబ్వే పాల్గొనలేదు. 2018లో హీత్ స్ట్రేక్ నుంచి కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్. క్రికెటర్లకు షూ స్పాన్సర్లు కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న జింబాబ్వే క్రికెట్ బోర్డు, కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్‌కి ఏటా రూ.34.69 లక్షలు వేతనంగా చెల్లిస్తోంది.
undefined
టాప్ 9 ఫిల్ సిమోన్స్, వెస్టిండీస్: వెస్టిండీస్ ఆటతీరు ఈ మధ్య కాస్త మెరుగ్గానే ఉంది. టీ20ల్లో అదరగొడుతున్న వెస్టిండీస్, టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన ఇస్తోంది. విండీస్ కోచ్ ఫిల్ సిమోన్స్‌కి విండీస్ బోర్డు ఏటా రూ.62.45 లక్షలు పారితోషికంగా చెల్లిస్తోంది.
undefined
టాప్ 8 మార్క్ బ్రౌచర్, సౌతాఫ్రికా: సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు ఈ మధ్య చాలా దారుణమైన ప్రదర్శన ఇస్తోంది. ఏబీ డివిల్లియర్స్ రిటైర్మెంట్ తర్వాత డుప్లిసిస్ టీ20 లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, డి కాక్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో వరుస పరాజయాలు ఫేస్ చేస్తోంది. సౌతాఫ్రికా క్రికెట్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న మాజీ క్రికెటర్ మార్క్ బ్రౌచర్, ఏటా దాదాపు కోటి రూపాయల దాకా ఆర్జిస్తున్నాడు.
undefined
టాప్ 7 రస్సెల్ డొమిగో, బంగ్లాదేశ్: పదేళ్ల కిందట పసికూనగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు, ఇప్పుడు మంచి పర్ఫామెన్స్ ఇస్తోంది. అయితే ఇప్పటికీ వాళ్లు నిలకడలేమి సమస్యను బాగా ఎదుర్కొంటున్నారు. బంగ్లాకి హెడ్ కోచ్‌గా ఉన్న రస్సెల్ డిమిగో, ఏటా రూ.కోటి 20 లక్షల దాకా వేతనం అందుకుంటున్నాడు.
undefined
టాప్ 6 మిస్బా వుల్ హక్, పాకిస్తాన్: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ మిస్బా వుల్ హక్, ప్రస్తుతం పాక్ క్రికెట్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు. టీ20ల్లో అదరగొడుతూ జింబాబ్వే, శ్రీలంక, సౌతాఫ్రికా వంటి ఫామ్‌లో లేని జట్లపై తన ప్రతాపాన్ని చూపిస్తున్న పాక్, కోచ్ మిస్బా వుల్‌ హక్‌కి ఏటా రూ.కోటి 52 లక్షలు పారితోషికంగా అందిస్తోంది.
undefined
టాప్ 5 గ్యారీ స్టెడ్, న్యూజిలాండ్: వరుస విజయాలతో టెస్టుల్లో టాప్‌కి దూసుకెళ్లిన న్యూజిలాండ్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతోంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్, కోచ్ గ్యారీ స్టెడ్‌కి ఏటా రూ.1.73 కోట్లు చెల్లిస్తోంది...
undefined
టాప్ 4 మిక్కీ ఆర్థర్, శ్రీలంక: ఐదేళ్ల క్రితం శ్రీలంక జట్టు వేరు, ఇప్పుడు మనం చూస్తున్న లంక జట్టు వేరు. కుమార సంగర్కర, జయవర్థనే, దిల్షాన్ వంటి స్టార్లు రిటైర్ అయిన తర్వాత విజయాల కోసం చాలా కష్టపడుతోంది శ్రీలంక. శ్రీలంక కోచ్ మిక్కీ ఆర్థర్, ఏటా రూ.2 కోట్ల 12 లక్షల దాకా పారితోషికం అందుకుంటున్నాడు.
undefined
టాప్ 3 క్రిస్ సిల్వర్‌వుడ్, ఇంగ్లాండ్: శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, భారత్‌లో మొదటి టెస్టులో ఘన విజయం సాధించినా ఆ తర్వాత వరుసగా మూడు టెస్టులతో పాటు వన్డే, టీ20 సిరీస్ కూడా కోల్పోయింది. ఈ మధ్యనే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన క్రిస్ సిల్వర్‌వుడ్‌కి ఏటా రూ.3 కోట్ల 60 లక్షల దాకా పారితోషికం చెల్లిస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.
undefined
టాప్ 2 జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా: కొన్నాళ్ల కిందట దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా, ఇప్పుడు ఆ రేంజ్ డామినేషన్ చూపించలేకపోతోంది. స్వదేశంలో భారత్ చేతిలో టీ20 సిరీస్‌తో టెస్టు సిరీస్ కోల్పోయింది ఆసీస్. ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్, ఏటా రూ.4 కోట్ల 60 లక్షలు వేతనంగా అందుకుంటున్నాడు.
undefined
టాప్ 1 రవిశాస్త్రి, టీమిండియా: ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ బోర్డు, హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఏటా రూ.8 కోట్ల 20 లక్షల పారితోషికంగా అందిస్తోంది. టాప్ 2లో ఆసీస్ కోచ్ కంటే ఇది దాదాపు రెట్టింపు మొత్తం. ప్రపంచంలో అత్యధిక వేతనాన్ని అందుకున్న క్రికెట్ కోచ్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిశాస్త్రి.
undefined
రవిశాస్త్రి కోచింగ్‌లో భారత జట్టు ఆసీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌లో అద్భుతాలు విజయాలు అందుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే ఓడినా, కోహ్లీతో స్నేహం కారణంగా మళ్లీ కోచ్‌గా రవిశాస్త్రికే ఓటేసింది బీసీసీఐ.
undefined
click me!