టెండూల్కర్, గ్యారీ సోబర్స్, బ్రాడ్‌మన్, విరాట్... నా దృష్టిలో ఆల్‌టైం గ్రేట్స్ వీళ్లే.. - సంజయ్ మంజ్రేకర్..

First Published Jun 7, 2021, 5:13 PM IST

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్‌ కాదంటూ భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. టెస్టుల్లో 400+ వికెట్లు, 5 సెంచరీలు చేసిన ఇద్దరు ప్లేయర్లలో ఒకడైన అశ్విన్, ఆల్‌టైం గ్రేట్ కాదని ఎలా అంటారని సంజయ్‌ మంజ్రేకర్‌ను ట్రోల్ చేశారు నెటిజన్లు.

టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా 611 వికెట్లతో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. అలాగే టెస్టుల్లో ఐదు సెంచరీలు బాది, 400+ వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, తర్వాతి స్థానంలో నిలిచాడు అశ్విన్.
undefined
అత్యధికమంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ రికార్డును కూడా దాటేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 13 మ్యాచులు ఆడి 67 వికెట్లు తీసిన అశ్విన్, మరో నాలుగు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు బౌలర్‌గా టాప్‌లో నిలుస్తాడు..
undefined
‘‘రవిచంద్రన్ అశ్విన్‌ను ఆల్‌టైం గ్రేట్‌గా ఒప్పుకోవాలంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను తీసిన ఎక్కువ వికెట్లు భారత ఉపఖండంలో వచ్చినవే. అదీకాకుండా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతనికి ఒక్క ఐదు వికెట్లు ప్రదర్శన కూడా లేదు.. ఇంగ్లాండ్ సిరీస్‌లో అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు తీశాడు’’ అంటూ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేశాడు.
undefined
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. దీంతో మరోసారి తన దృష్టిలో ఆల్‌టైం గ్రేట్ అంటే ఎలా ఉండాలో చెబుతూ ఓ ట్వీట్ వేశాడు సంజయ్. ‘ఆల్‌టైం గ్రేట్ అంటే అది గొప్ప గుర్తింపు, ఓ క్రికెటర్‌కి ఇచ్చే అతిపెద్ద గౌరవం. డాన్ బ్రాడ్‌మన్, గ్యారీ సోబర్స్, సునీల్ గవాసకర్, టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లే నా పుస్తకంలో ఆల్‌టైం గ్రేట్‌. అశ్విన్ మీద ఎంతో గౌరవం ఉన్నా అతను ఇంకా ఆల్‌టైం గ్రేట్‌లో చేరలేదు’ అంటూ ట్వీట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్.
undefined
కొద్దిసేపటి తర్వాత అభిమానుల డిమాండ్‌తో కొంతమంది ఆల్‌టైం గ్రేట్ బౌలర్లు అంటూ ఇంకో ట్వీట్ వేశాడు సంజయ్. ‘హార్డ్‌లీ, మార్షల్, అక్రమ్, వార్న్... వార్న్ భారత్‌పై వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డాడు. అది తప్ప అతను కూడా మ్యాచ్ విన్నర్. ఇంగ్లాండ్‌లో కూడా అతనికి 8 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు సంజయ్...
undefined
అయితే తాజా ట్వీట్‌తో సంజయ్ మంజ్రేకర్ 12 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ మీద వేసిన ఓ పాత ట్వీట్ వైరల్‌గా మారింది. 2012, జనవరి 6న ‘నేను ఇంకా వీవీఎస్‌ను తప్పించి, తర్వాతి టెస్టులో రోహిత్ శర్మకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నా. అలాగే విరాట్ కోహ్లీని ఇంకో టెస్టు ఆడించాలి. అప్పుడు కానీ అతను టెస్టులకు పనికి రాడని సెలక్టర్లకు తెలిసిరాదు’ అంటూ ట్వీట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్.
undefined
ఈ ట్వీట్ వేసిన సరిగ్గా 9 సంవత్సరాల ఐదు నెలలకు విరాట్ కోహ్లీని ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా గుర్తిస్తూ ట్వీట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్. విరాట్‌లాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా తన ప్రదర్శనతో సంజయ్ మంజ్రేకర్ ఆల్‌టైం గ్రేట్ లిస్టులో చేరతాడని అంటున్నారు నెటిజన్లు.
undefined
click me!