‘వాట్సాప్‌లో వచ్చింది, చూడకుండా పోస్టు చేశా... సారీ!’... బింద్రన్‌వాలే పోస్టుపై క్రికెటర్ హర్భజన్ సింగ్...

Published : Jun 07, 2021, 05:59 PM IST

ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీంతో హర్భజన్ సింగ్, ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ... అది కేవలం వాట్సాప్‌లో వచ్చిందని, తాను చూసుకోకుండా పోస్టు చేశానని ట్వీట్ చేశాడు.

PREV
18
‘వాట్సాప్‌లో వచ్చింది, చూడకుండా పోస్టు చేశా... సారీ!’... బింద్రన్‌వాలే పోస్టుపై క్రికెటర్ హర్భజన్ సింగ్...

‘ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. అది నాకు వాట్సాప్‌లో ఫార్వర్డ్‌గా వచ్చిన మెసేజ్. నేను దాన్ని సరిగ్గా చూడకుండా, కంటెంట్ అర్థం చేసుకోకుండా పోస్టు చేశాను... అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయాను. 

28

ఇది నా తప్పే, నేను అంగీకరిస్తున్నా. ఆ పోస్టులోని ఆలోచనలకు కానీ, ఆ ఫోటోల్లోని వ్యక్తుల సిద్ధాంతాలకు కానీ నేను కట్టుబడి లేను. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను...

38

నేను ఓ సిక్కును. నా భారతదేశం కోసం యుద్ధం చేస్తా అంతేకానీ దేశానికి వ్యతిరేకంగా కాదు. నా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హానీ చేసే ఏ దేశ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు, ఎప్పటికీ సహకరించను కూడా...’ అంటూ రాసుకొచ్చాడు హర్భజన్ సింగ్. 

48

భారత సీనియర్ స్పిన్నర్, ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్... నిన్న‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో చంపబడిన ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ నివాళులు అర్పిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్టు చేశాడు... దీంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది...

58

1984లో భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్‌’లో ప్రాణాలు కోల్పోయిన ఖలీస్తానీ టెర్రరిస్ట్ జర్నీల్ సింగ్ బింద్రన్‌వాలేతో ఆ దాడిలో గోల్డెన్ టెంపుల్‌లో చంపబడినవారికి నివాళులు అర్పిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు హర్భజన్ సింగ్.

68

ఈ సంఘటన జరిగి 37 ఏళ్లు అయిన సందర్భంగా పంజాబ్‌లో స్వర్ణ దేవాలయంలో ప్రాణాలు కోల్పోయిన బింద్రన్‌వాలేతో మరో నలుగురి ఫోటోలను పోస్టు చేసి ‘అమరవీరులకు సెల్యూట్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. భజ్జీ చేసిన పోస్టులో ‘శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో జూన్ 1 నుంచి జూన్ 6, 1984 వరకూ జరిగిన ఆపరేషన్‌లో వీరమరణం చెందిన అమరవీరులకు నివాళులు’ అని పంజాబీలో రాసి ఉంది.

78

ఈ పోస్టుతో హర్భజన్ సింగ్‌కి భారత్‌లో ఉండడం ఇష్టం లేదని, వేల మంది ప్రాణాలు తీసిన తీవ్రవాది బింద్రన్‌వాలే, తనకి అమరవీరుడిగా కనిపిస్తున్నాడంటే... అతను ఏ స్టేజ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చంటూ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. దీంతో తన తప్పు తెలుసుకున్న భజ్జీ, బేషరతుగా క్షమాపణలు చెప్పాడు.

88

హర్భజన్ సింగ్‌తో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్ వికెట్లు తీసిన యువ క్రికెటర్ హర్‌ప్రీత్ బ్రార్ కూడా బింద్రన్‌వాలే, ఖలీస్తానీ అమరవీరులకు నివాళులు ఘటిస్తూ పోస్టులు చేయడం విశేషం.

click me!

Recommended Stories