టీమిండియా హెడ‌కోచ్ పదవిపై కన్నేసిన టామ్ మూడీ... అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కనబెట్టి...

First Published Oct 10, 2021, 3:35 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగియనుంది. మరి ఆ తర్వాత భారత హెడ్‌కోచ్ ఎవరు? ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకకపోయినా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ డైరెక్టర్ టామ్ మూడీ, రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట...

సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
(photo Source- Getty)

వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ట్రెవర్ బేలిస్‌కి ఇష్టం లేకపోయినా, టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ నిర్ణయంతో ఆ పని చేయాల్సి వచ్చిందట...

టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి అత్యంత ఆసక్తిగా ఉన్న టామ్ మూడీ, అందులో భాగంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చేశాడట...

సరిగా ఆడకపోతే ఎలాంటి ప్లేయర్‌తోనైనా కఠినంగా వ్యవహరిస్తానని బీసీసీఐకి సూచనలు పంపేందుకు డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాడట డేవిడ్ వార్నర్...

ఆస్ట్రేలియా తరుపున 8 టెస్టులు, 76 వన్డే మ్యాచులు ఆడిన టామ్ మూడీ, క్రికెటర్‌గా కంటే కోచ్‌గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు...

2001 నుంచి వివిధ టీ20 ఫ్రాంఛైజీలకు కోచ్‌గా, క్రికెటర్ డైరెక్టర్‌గా వ్యవహరించిన టామ్ మూడీ, 2005లో శ్రీలంక జట్టుకి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 

టామ్ మూడీ కోచింగ్‌లోనే శ్రీలంక జట్టు, 2007 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్‌కి ప్రవేశించింది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ ఘోర పరాభవం తర్వాత అప్పటిదాకా కోచ్‌గా ఉన్న గ్రెగ్ ఛాపెల్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో టీమిండియా కోచ్‌గా టామ్ మూడీ పేరు వినిపించింది...

అయితే అప్పుడు వీలుపడలేదు. ఆ తర్వాత వెస్ట్రన్ వారియర్స్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీ, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి 2008 నుంచి 10 వరకూ హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు...

2013 నుంచి 2019 వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీ, 2016లో ఆరెంజ్ ఆర్మీ టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు...

ఐపీఎల్‌లో పాటు బంగ్లా ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి టీ20 లీగుల్లో జట్లకి కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీ, ప్రస్తుతం శ్రీలంక జట్టుకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు...

అంతా బాగానే ఉన్నా, టామ్ మూడీ తరహాలోనే వ్యవహరించిన గ్రెగ్ ఛాపెల్ కోచింగ్‌లో భారత జట్టుకు తీవ్ర నష్టం జరిగింది. సౌరవ్ గంగూలీ ఫామ్‌లో లేడని అతన్ని తీసి, ద్రావిడ్‌కి కెప్టెన్సీ అప్పగించాడు ఛాపెల్...

రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో భారత జట్టు కొన్ని విజయాలు అందుకున్నా, 2007 వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. బంగ్లాదేశ్ చేతుల్లో చిత్తుగా ఓడింది.

భారత జట్టుకి హెడ్ మాస్టర్‌లా కఠినంగా వ్యవహరించే కోచ్‌ ఎప్పుడూ కలిసి రాలేదు. మరి టామ్ మూడీ ఇంట్రెస్ట్‌పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే...

click me!