IPL2021: వామ్మో..! ఐపీఎల్ ద్వారా హర్ధిక్ పాండ్యా అంత సంపాదించాడా..! ఇలా అయితే మళ్లీ కష్టమేనంటున్న సెహ్వాగ్

First Published Oct 10, 2021, 1:30 PM IST

Hardik Pnadya: ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ నుంచి భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. ఈ లీగ్ లో ఇప్పటివరకు భారీగానే సంపాదించాడు. 

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా భవితవ్యంపై ఒకవైపు సందిగ్దత నెలకొంది. త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో అతడు ఆడుతాడా..? లేదా..? ఒకవేళ ఆడితే బౌలింగ్ వేస్తాడా.? లేదా..? అనేది అనుమానంగాఉంది. 

ఈ విషయం నేటి సాయంత్రంతో తేలిపోతుంది. అయితే 2015 లో ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. ధనాధన్ ఆటతో ముంబై ఇండియన్స్ లో కీ ప్లేయర్ గా మారాడు. 

ఆరేండ్లుగా ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న పాండ్యాకు ఇప్పటివరకు ఈ సీజన్ తో కలుపుకుని రూ. 44.3 కోట్లు ముట్టాయని సమాచారం. 

2015 లో అంతగా గుర్తింపు లేని పాండ్యా ను ముంబై రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. 2017 సీజన్ దాకా అదే ధరను అతడికి ఇచ్చింది.

కానీ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్ ను చూసిన ముంబై.. 2018 లో అతడికి రూ. 11 కోట్లకు కొనుక్కుంది. దాంతో పాండ్యా లైఫ్ స్టైల్ అమాంతం మారిపోయింది. 

అంటే 2015 నుంచి 2017 దాకా ఏటా రూ. 10 లక్షలు (రూ. 30 లక్షలు) .. 2018 నుంచి తాజా సీజన్ దాకా ప్రతి సంవత్సరం రూ. 11 కోట్లు (రూ. 44 కోట్లు) సంపాదించాడు. 

మొత్తంగా ఐపీఎల్ ద్వారా  హార్ధిక్ పాండ్యా రూ. 44.3 కోట్లను సంపాదించాడు. అయితే వచ్చే సీజన్ లో మాత్రం అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం కష్టమేనని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఒకవేళ పాండ్యా బౌలింగ్ చేయకుంటే ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసే సాహసం చేయకపోవచ్చునని తెలిపాడు. పాండ్యా ఫామ్, ఫిట్నెస్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముంబై.. 2022 మెగా ఆక్షన్ లో  అతడిని మళ్లీ కొనే అవకాశాలు లేవని వ్యాఖ్యానించాడు. తానైతే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్లనే తీసుకుంటానని చెప్పాడు. 

click me!