IPL2021 CSK vs DC: నేటి మ్యాచ్ లో ఈ రికార్డులు బద్దలవుతాయా..? ఢిల్లీ-చెన్నై పోరులో ఆసక్తికర అంశాలు

Published : Oct 10, 2021, 03:20 PM IST

IPL2021 CSK vs DC: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం దుబాయ్ లో జరుగనున్న పోరులో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. అయితే ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యే అవకాశముంది. అవేంటో ఒకసారి ఇక్కడ చూద్దాం.

PREV
18
IPL2021 CSK vs DC: నేటి మ్యాచ్ లో ఈ రికార్డులు బద్దలవుతాయా..? ఢిల్లీ-చెన్నై పోరులో ఆసక్తికర అంశాలు

ఐపీఎల్ లో నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ల మధ్య జరుగనున్నది. మరికొద్ది గంటల్లో మొదలుకానున్న ఈ పోరులో గెలిచి ఫైనల్ కు చేరాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో బద్దలవడానికి పలు రికార్డులు వేచి చూస్తున్నాయి. అవేంటంటే... 

28

మరో 83 పరుగులు చేస్తే Chennai super kings సారథి MS DHONI టీ20 క్రికెట్ (ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ లు కలిపి) లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన వాడవుతాడు.  

38
Ambati Rayudu

ఈ మ్యాచ్ లో 85 పరుగులు చేస్తే CSK బ్యాట్స్మెన్ అంబటి రాయుడు టీ20 క్రికెట్ లో 4 వేల పరుగులు మైలురాయిని చేరుకుంటాడు.

48

అంతేగాక రాయుడు గనుక ఈ మ్యాచ్ లో ఒక సిక్సర్ బాదితే ఐపీఎల్ లో 150 సిక్సర్లు కొట్టిన క్రికెటర్ గా రికార్డులకెక్కుతాడు. మొత్తంగా అతడికి టీ20 లో 200వ సిక్సర్ కానుంది. 

58

చెన్నై ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో గనుక నేటి మ్యాచ్ లో ఆడితే అది ఐపీఎల్ లో అతడి 150 మ్యాచ్ అవుతుంది. అంతేగాక మరో వికెట్ తీస్తే టీ20లో 550 వికెట్లు తీసిన బౌలర్ గా Bravo రికార్డులకెక్కుతాడు. 

68

మరో ఐదు వికెట్లు తీస్తే iplలో వంద వికెట్లు తీసిన బౌలర్ గా ఢిల్లీ బౌలర్ అక్షర్ పటేల్  రికార్డు సృష్టిస్తాడు. ఐపీఎల్ లో వేయి పరుగులు పూర్తి చేయడానికి అక్షర్ పటేల్ కు మరో 61 పరుగులు అవసరమున్నాయి. 

78

ఈ సీజన్ లో అత్యధిక పరుగుల వీరుడు (ప్రస్తుతం kl rahul 626 పరుగులు) గా నిలవాలంటే చెన్నై ఓపెనర్ల్ రుతురాజ్ గైక్వాడ్ కు 94 పరుగులు కావాల్సి ఉండగా.. డుప్లెసిస్ కు 81 పరుగులు,  ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్ ధావన్ కు 83 పరుగులు అవసరమున్నాయి. 

88
Shikhar Dhawan

నేటి మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొడితే.. టీ20 క్రికెట్ లో 200 సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలువనున్నాడు. 

click me!

Recommended Stories