వాళ్లకు ఎలా బౌలింగ్ చేశావో చెప్పు... మహేశ్ పిథియాని అడిగిన రవిచంద్రన్ అశ్విన్...

First Published Feb 8, 2023, 2:42 PM IST

2021 ఇంగ్లాండ్ టూర్‌లో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే స్వదేశంలో జరిగే టెస్టుల్లో సీన్ వేరు. ఇక్కడ రవిచంద్రన్ అశ్వినే మ్యాచ్ విన్నర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్‌పైన అందరి ఫోకస్..

ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌పై రవిచంద్రన్ అశ్విన్‌కి మంచి రికార్డు ఉంది. స్టీవ్ స్మిత్‌ని టెస్టుల్లో ఆరుసార్లు అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్,2020-21 ఆసీస్ టూర్ సమయంలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ని డకౌట్ చేశాడు...

Mahesh Pithiya-Ashwin

అందుకే రవిచంద్రన్ అశ్విన్‌ని టెస్టు సిరీస్‌లో ఫేస్ చేయడానికి అతనిలా బౌలింగ్ చేసే మహేశ్ పిథియాని నెట్ బౌలర్‌గా పెట్టుకుంది ఆస్ట్రేలియా. నెట్స్‌లో ఎక్కువగా స్టీవ్ స్మిత్‌కే బౌలింగ్ చేసిన మహేశ్ పిథియా, అశ్విన్‌ని కలిసాడు..

‘నెట్స్‌లో మొదటి రోజే స్టీవ్ స్మిత్‌ని ఐదారుసార్లు అవుట్ చేశాను. రవిచంద్రన్ అశ్విన్‌ని కలిసి వెంటనే, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నా. నా చిన్నప్పటి నుంచి అశ్విన్ నా రోల్ మోడల్. ఆయన్ని ఇమిటేట్ చేస్తూ బౌలింగ్ నేర్చుకున్నా...
 

నన్ను హగ్ చేసుకున్న అశ్విన్, ఆస్ట్రేలియన్లకు ఎలా బౌలింగ్ చేశావని అడిగాడు. విరాట్ కోహ్లీ కూడా నా వైపు చూసి నవ్వుతూ థమ్సప్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు.. నేను క్యారమ్ బాల్ కానీ దుస్రా కానీ వేయను. నా బౌలింగ్ స్టైల్ వేరు...

నాకు ఆఫ్ బ్రేక్‌తో పాటు నా అంతట నేను డెవలప్‌ చేసుకున్న బ్యాక్ స్పిన్ ఆయుధాలు. అయితే దాన్ని వైట్ బాల్ క్రికెట్‌లోనే ఎక్కువగా వాడతాను. ఆస్ట్రేలియా టీమ్‌కి బౌలింగ్ చేసే అవకాశం రావడం చాలా ఆనందాన్ని కలిగించింది...

ఇప్పుడు నా బౌలింగ్ గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో కూడా నా గురించి వార్తలు వస్తున్నాయి. నా జాబ్ స్పెషల్‌గా స్టీవ్ స్మిత్‌కి బౌలింగ్ చేయడమే. అతను ఇది వెయ్? అది వెయ్... అని ఏమీ అడగలేదు. చెప్పలేదు...

నాథన్ లియాన్ మాత్రం నా బౌలింగ్‌ గురించి అడిగాడు. నా బౌలింగ్ గ్రిప్ గురించి చేతి వేళ్లతో బంతిని తిప్పే విధానం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత బంతి ఎక్కువ తిరగాలంటే ఏం చేయాలో చెప్పాడు...

Image credit: PTI

నా సత్తాపై నమ్మకం పెట్టుకోమ్మని, త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయని విష్ చేశాడు. ఫిబ్రవరి 17 వరకూ నేను ఆస్ట్రేలియా టీమ్‌తోనే ఉండబోతున్నాను. ఇది నా లైఫ్ ఛేజింగ్ మూమెంట్...’ అంటూ చెప్పుకొచ్చాడు 21 తమిళనాడు స్పిన్నర్ మహేశ్ పిథియా..  

click me!