సిక్సర్లు కొట్టాలంటే అదొక్కటి ఉంటే సరిపోదు... టీమిండియా బ్యాటర్ శుబ్‌మన్ గిల్...

First Published | Nov 18, 2022, 4:05 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ముగించిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. వర్షం కారణంగా వెల్లింగ్టన్‌లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయింది. టీమిండియా తరుపున టెస్టులు, వన్డేల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి సెలక్టర్లను మెప్పించిన శుబ్‌మన్ గిల్, ఈ సిరీస్ ద్వారా టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడు...
 

Shreyas Iyer-Shubman Gill

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరుపున ఆడిన శుబ్‌మన్ గిల్, 483 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో సెంచరీతో రాణించాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగానే గిల్, టీ20ల్లో అవకాశం దక్కింది...

Shubman Gill

‘అండర్19 వరల్డ్ కప్‌ కోసం 2018లో న్యూజిలాండ్‌కి వచ్చాను. 2019లో ఇక్కడే వన్డే ఆరంగ్రేటం చేశాను. మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. న్యూజిలాండ్‌లో నాకు ఎన్నో అందమైన మెమొరీస్ ఉన్నాయి. న్యూజిలాండ్‌కి వెళ్తున్నానంటే నా ముఖం మీద చిరునవ్వు వచ్చేస్తుంది...


సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ సమయంలోనే టీ20ల్లో రాణించేందుకు అవసరమైన మార్పులు చేసుకున్నాను. సిక్సర్లు కొట్టేందుకు పవర్ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే సిక్సర్లు బాదాలంటే పవర్ కంటే టైమింగ్ చాలా అవసరం...

Image credit: Shubman GillTwitter


నా టైమింగ్‌పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు సిక్సర్లు, ఫోర్లు బాదడం కంటే ఎక్కువగా జట్టుకి అవసరమైన పరుగులు చేయడమే ముఖ్యం. ఆ పరుగులు ఎలా వచ్చినా నాకు సంతోషమే...

Image credit: Getty

ఎక్కువగా డాట్ బాల్స్ ఆడడం నాకు ఇష్టం ఉండదు. ప్రతీ బాల్‌కి సింగిల్ లేదా డబుల్స్ తీయాలని ఆరాటపడతాను. బంతి స్వింగ్ అయ్యేదాకా వేయిట్ చేస్తే ఈజీగా పరుగులు రాబట్టొచ్చు. అదే స్వింగ్‌ చేసి పరుగులు చేయాలని అనుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ఢేటింగ్ చేస్తున్నాడనే వార్తలతో యూత్‌లో క్రేజ్ దక్కించుకున్న శుబ్‌మన్ గిల్, ప్రస్తుతం బాలీవుడ్ నటి సారా ఆలీ ఖాన్‌తో యవ్వారం నడిపిస్తున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో సారాతో ఢేటింగ్ చేస్తున్నట్టుగా పరోక్షంగా కన్ఫార్మ్ కూడా చేసేశాడు శుబ్‌మన్ గిల్... 

Latest Videos

click me!