టీ20 వరల్డ్ కప్‌లో అతన్ని ఆడించకపోవడమే టీమిండియా చేసిన తప్పు... - మహ్మద్ కైఫ్...

First Published Nov 18, 2022, 3:06 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచి నిష్కమించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టైటిల్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది...

Sanju Samson

టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను ఆడించాలని డిమాండ్ చేస్తూ... '#SanjuSamsonforT20WC' హ్యాష్‌ట్యాగ్‌ని వీరలెవెల్‌లో ట్రెండ్ చేసిన అభిమానులు, తిరువనంతపురంలో జరిగిన ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లో నిరసన గళం వినిపించాలని ప్లాన్ చేశారు...

Sanju Samson-Shreyas Iyer

అయితే సంజూ శాంసన్‌కి టీమిండియా-A టీమ్ కెప్టెన్సీ అప్పగించిన బీసీసీఐ, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి అతన్ని ఎంపిక చేసి... అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చింది. అయితే టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది...

Sanju Samson and Rishabh Pant

టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయంతో టీమిండియాలో యువరక్తాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది బీసీసీఐ. సీనియర్లను టీ20 ఫార్మాట్ నుంచి తప్పించి, కుర్రాళ్లను పొట్టి ఫార్మాట్‌లో కొనసాగించాలని భావిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్... కుర్రాళ్ల సత్తాకి మొదటి పరీక్ష...

Image credit: PTI

‘టీమిండియా ఫ్యూచర్ గురించి ఓ ప్లేయర్... భవిష్యత్ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయాడు. అతనే సంజూ శాంసన్. సంజూ ఐదో స్థానంలో ఆడగలడు. ఓపెనర్‌గా రాణించగలడు...

Sanju Samson

వన్‌డౌన్‌లో, టూ డౌన్‌లో వచ్చి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు కూడా ఆడగలడు. ఏ పొజిషన్‌లో అయినా పరుగుల వరద పారించగల ప్లేయర్లు ఉండడం చాలా అరుదు. రాజస్థాన్ రాయల్స్‌కి అతను కీ ప్లేయర్. సంజూ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్, 2022 సీజన్‌లో ఫైనల్‌ చేరింది...

Image credit: PTI

వెస్టిండీస్‌తో సిరీస్‌లో సంజూ శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. రెండు మూడు వికెట్లు పడిన తర్వాత కూడా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు. సంజూ ఫియర్‌లెస్ బ్యాటింగ్, టీమిండియాకి ఇప్పుడు కావాలి...

Sanju Samson

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అతన్ని ఎంపిక చేయకపోవడమే టీమిండియా చేసిన అతిపెద్ద తప్పు. సంజూ స్పిన్నర్లను బాగా ఆడతాడు, ఫాస్ట్ బౌలర్లను ఇంకా బాగా ఆడతాడు. టీ20 వరల్డ్ కప్ ఆడడానికి అతనికి అర్హతలు ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్... 

click me!