ఆసియా కప్ 2023 టోర్నీకి ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు ఉండడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతుంటే, తిలక్ వర్మ ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు...
దేశవాళీ టోర్నీల్లో లిస్టు-ఏ క్రికెట్‌లో తిలక్ వర్మకు మంచి రికార్డు ఉంది. ఆ రికార్డుతో పాటు వెస్టిండీస్ టూర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ చూపించిన ఆటతీరు ఆధారంగా అతనికి ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కింది..
28
వెస్టిండీస్ టూర్‌లో తొలి మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, ఆ తర్వాత వరుసగా 51, 49, 7 నాటౌట్, 27 పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ పర్ఫామెన్స్‌తో ఏకంగా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు..
38
‘తిలక్ వర్మ చాలా టాలెంటెడ్. మంచి ప్లేయర్ కూడా. అయితే ఎంత బ్రిలియెంట్ ప్లేయర్ అయినా ఆసియా కప్ లాంటి బిగ్ టోర్నమెంట్‌లో ఆరంగ్రేటం చేయించడం సరైన పద్ధతి కాదు. దానికి ముందు అతనితో కొన్ని వన్డే సిరీస్‌లు ఆడించాలి..
48
సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయం చెప్పాడు. తిలక్ వర్మకు అంతర్జాతీయ వన్డేలు ఆడిన అనుభవం లేదు. ఎలాంటి అనుభవం లేకుండా వరల్డ్ కప్‌లో ఆడించాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
58
వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ముందు అతను కొన్ని టీ20 సిరీస్‌లు ఆడాలి. అలాగే వన్డే సిరీస్‌లు ఆడుతూ వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి సిద్ధం చేయాలి. ఓ యంగ్‌స్టర్‌ని తయారుచేసే పద్ధతి అలాగే ఉంటుంది...
68
Tilak Varma
నేరుగా ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడిస్తే... యంగ్‌స్టర్స్, ప్రపంచ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం ఇంత తేలికా? అనుకుంటారు. ప్రపంచ కప్ ఆడాలంటే ఎంత మంది ప్లేయర్లతో పోటీపడాలి? ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వాలి? ఆ విషయం కుర్రాళ్లకు తెలియాలి..
78
Sanju Samson and Tilak Varma
ఏదైనా తేలిగ్గా దొరికేస్తే దానికి విలువ ఉండదు. తిలక్ వర్మ లేదా మరే యంగ్ ప్లేయర్ అయినా, స్టార్ ప్లేయర్‌గా రాటుతేలాలంటే అతన్ని ద్వైపాక్షిక సిరీసుల్లో పరీక్షించాలి. ఆ తర్వాతే మెగా టోర్నీల్లో ఆడించాలి... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్..
88
ఆసియా కప్ 2023 టోర్నీకి ప్రకటించిన జట్టులో చోటు దక్కినప్పటికీ తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోకపోతే అతని ప్లేస్‌లో ఇషాన్ కిషన్‌ని ఆడించనుంది టీమిండియా. అయ్యర్ ప్లేస్‌లో సూర్య ఆడే అవకాశం ఉంది. కాబట్టి తిలక్ వర్మ తుది జట్టులోకి రావాలంటే అద్భుతం జరగాల్సిందే..