ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ఆ రెండు డ్రాప్‌లే కారణం... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్...

First Published Jun 28, 2021, 4:39 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. టీమిండియా తరుపున రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోవడం విశేషం...

రిజర్వు డే రోజున 642 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా, 170 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 32 పరుగుల ఆధిక్యం పోగా, న్యూజిలాండ్ విజయలక్ష్యం కేవలం 139 పరుగులే.
undefined
ఈ టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించిన న్యూజిలాండ్ జట్టు, 21 ఏళ్ల తర్వాత మొట్టమొదటి ఐసీసీ టైటిల్ కైవసం చేసుకుంది...
undefined
‘ఫైనల్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. అయితే కివీస్‌కి టీమిండియానే ఛాన్సులు ఇచ్చిందని ఒప్పుకోవాల్సిందే. ముఖ్యంగా పూజారా డ్రాప్ చేసిన రాస్ టేలర్ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసి ఉండేది...
undefined
త్వరత్వరగా మూడు వికెట్లు పడితే న్యూజిలాండ్ ఒత్తిడిలోకి వెళ్లి ఉండేది. ఎందుకంటే అప్పటికే వాళ్ల జట్టులో ఉన్న హెన్రీ నికోలస్, వాట్లింగ్ గాయపడ్డారు. వాళ్లు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయడం సాధ్యమయ్యే పనికాదు...
undefined
ఆ ఇద్దరినీ అవుట్ చేస్తే టెయిలెండర్లను నియంత్రిస్తే సరిపోయేది. అయితే ఒత్తిడి ఉన్నప్పుడు ఏదైనా జరగొచ్చు. కేన్ విలియంసన్ ఒక్క రాష్ షాట్ ఆడి ఉంటే, టీమిండియానే గెలిచి ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్..
undefined
జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను ఛతేశ్వర్ పూజారా జారవిడచగా, మహ్మద్ షమీ బౌలింగ్‌లో కేన్ విలియంసన్ ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా అందుకోలేకపోయాడు...
undefined
న్యూజిలాండ్ బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడని, ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామనే ఒత్తిడి ఏ మాత్రం లేకుండా క్రమశిక్షణతో నడుచుకున్నారని ఇదే వారి విజయానికి కారణమైందని అన్నాడు బ్రాడ్ హాగ్...
undefined
ఛతేశ్వర్ పూజారా క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన రాస్ టేలర్ 100 బంతుల్లో 47 పరగులు చేసి అజేయంగా నిలువగా, కేన్ విలియంసన్ 89 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
undefined
click me!