‘ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి రోజును టీమిండియా పాజిటివ్ ఎనర్జీతోనే మొదలెట్టింది. కచ్ఛితంగా రిజల్ట్ రావాలనే కసితోనే ఆటను ప్రారంభించారు. అయితే మొదటి గంటలోనే విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వికెట్లు పోవడంతో టీమ్‌లో ఒత్తిడి పెరిగింది...
లంచ్ బ్రేక్ సమయానికే అజింకా రహానే కూడా అవుట్ కావడంతో టీమిండియా వెనకబడింది. రహానే క్రీజులో ఉన్నంతసేపు కూడా ఏదో ఇబ్బంది పడుతున్నట్టే కనిపించాడు...
రిషబ్ పంత్ మాత్రం వచ్చినప్పటి నుంచి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలనే మైండ్‌సెట్‌తోనే కనిపించాడు. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీ బాదాలని చూస్తున్న పంత్, లంచ్ లోపు అవుట్ కాకపోవడం అతని అదృష్టమే...
రిషబ్ పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బా టెస్టు తర్వాత అతన్ని పూర్తిగా మ్యాచ్ విన్నర్‌గా చూస్తున్నారు జనాలు. టెస్టు ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి చూస్తే, ఇప్పుడే అతని అసలైన ఫాలోయింగ్ కనిపిస్తోంది.
సిడ్నీలో పంత్ ఆడిన ఇన్నింగ్స్, గబ్బాలో భారత జట్టుకి విజయాన్ని అందించిన తీరు అతనిపై భారీ అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం...
ఇంగ్లాండ్‌పై కూడా అతను ఎంతో కంట్రోల్డ్‌గా ఆడుతూ సెంచరీ సాధించాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో లంచ్ టైమ్ తర్వాత రిషబ్ పంత్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది...
చాలా బంతులను ఆడకుండా వదిలేశాడు. ఇంగ్లాండ్‌పై స్వింగ్ బంతులను వదిలేస్తూ, ఎంతో తన క్రేజీ యాటిట్యూడ్‌తో సెంచరీ బాది, ప్రత్యర్థిని దెబ్బతీసిన పంత్, ఫైనల్ అలా ఆడలేకపోయాడు...
అతను కేవలం భారత జట్టుకి ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే కాదు, ఎలాంటి భయం లేకుండా ఐదుగురు బౌలర్లను ఆడించేందుకు టీమిండియాకి దొరికిన భరోసా కూడా...
పంత్‌కి లంచ్ టైమ్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నుంచి సూచనలు అంది ఉండవచ్చు. ఇలా ఆడు, అలా ఆడకు అని అతని మెదడును తొలిచేసి, ప్రెషర్‌లో పడేసి ఉండవచ్చు...
అందుకే తన సహజ శైలిలో బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడిన రిషబ్ పంత్, అనవసర షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయితే అతని ఇన్నింగ్స్ వెలకట్టలేనిది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...