సంజూ శాంసన్ సింగిల్ తీయకపోవడానికి కారణం ఇదే... కోచ్ కుమార సంగర్కర కామెంట్...

Published : Apr 13, 2021, 04:45 PM IST

222 పరుగుల టార్గెట్‌కి అతిచేరువగా వచ్చిన రాజస్థాన్ రాయల్స్... 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. 20వ ఓవర్‌ ఐదో బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీయడానికి నిరాకరించడంపై చాలా పెద్ద చర్చే జరిగింది... అసలు సంజూ శాంసన్ సింగిల్ తీసి ఉంటే... రాజస్థాన్ రాయల్స్‌ గెలిచి ఉండేదేమోనని అనేవాళ్లు కూడా ఉన్నారు...

PREV
110
సంజూ శాంసన్ సింగిల్ తీయకపోవడానికి కారణం ఇదే... కోచ్ కుమార సంగర్కర కామెంట్...

ఆఖరి ఓవర్‌లో నాన్‌స్ట్రైయికింగ్‌లో ఉన్న సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్... అతన్ని ఐపీఎల్ 2021 వేలంలో ఏకంగా రూ.16 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...

210

అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసి, ఆఖరి బంతికి స్ట్రైయిక్ ఇవ్వడానికి నిరాకరించడం అంటే క్రిస్ మోరిస్‌, సిక్సర్ కొడతాడనే నమ్మకం లేకపోవడమే...అది ఓ రకంగా మోరిస్‌ను అవమానించడం లాంటిదే...

310

సింగిల్ తీసేందుకు దాదాపు అవతలి ఎండ్ దాకా వెళ్లిపోయిన క్రిస్ మోరిస్, సంజూ శాంసన్ వెనక్కి వెళ్లాలని సూచించడంతో మళ్లీ వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చాడు. సింగిల్ తీయడానికి నిరాకరించడం చూసి, నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోవడమూ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...

410

‘సంజూ శాంసన్ ఆఖరి బంతికి స్ట్రైయిక్ తీసుకుని, మ్యాచ్‌ను ముగించాలని భావించాడు. అది తనపై తనకి ఉన్న నమ్మకం. ఆఖరి బంతికి అతను కొట్టిన షాట్ కూడా బౌండరీకి కొన్ని ఇంచుల ముందు క్యాచ్‌గా మారింది...

510

అది బ్యాడ్‌లక్...కానీ మ్యాచ్‌ను నేను గెలిపించగలననే నమ్మకం చాలా చాలా విలువైనది. ఒకవేళ ఐదో బంతికి సింగిల్ తీసి, ఆఖరి బంతికి మోరిస్‌కి స్ట్రైయికింగ్ ఇచ్చి.. అతను భారీ షాట్ ఆడలేకపోతే... అప్పుడు తప్పు సంజూ శాంసన్‌దే అయిఉండేది...

610

క్రిస్‌మోరిస్ అప్పుడే వచ్చాడు. అంతకుముందు ఎదుర్కొన్న బంతికి సింగిల్ మాత్రమే తీశాడు. 20వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీయకుండా క్రిస్ మోరిస్ భారీ షాట్ ఆడి ఉంటే, మ్యాచ్ ఫలితమే మారిపోయేది...

710

అతను సింగిల్ తీయడం వల్లే, ఆఖరి బంతికి క్రిస్ మోరిస్‌కి స్ట్రైయికింగ్ ఇవ్వడానికి సంజూ శాంసన్ సాహసించలేదు... సంజూ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. మ్యాచ్ ఇక్కడిదాకా వచ్చిదంటే దానికి అతనే కారణం...

810

సంజూ శాంసన్‌కి తన బలం ఏంటో పక్కాగా తెలుసు... ఇంకోసారి ఇలాంటి పరిస్థితి వస్తే, ఆఖరి బంతికి మరీ భారీ సిక్సర్ కొట్టగలడు సంజూ అతను’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగర్కర...

910

‘సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఓ అద్భుతం... ఐదో బంతికి బౌండరీ రాకపోవడంతో ఆఖరి బంతికి సిక్సర్ బాదాలని అతను ఫిక్స్ అయ్యాడు. అందుకే సింగిల్ లేదా డబుల్ తీయడానికి ప్రయత్నించలేదు...

1010

ఆ బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించి ఉంటే, సంజూ రనౌట్ అయ్యేవాడు... ఆఖరి బంతికి స్ట్రైయికింగ్ ఇవ్వనంత మాత్రాన అతని ఇన్నింగ్స్‌ను తక్కువ చేయకూడదు’ అంటూ కామెంట్ చేశాడు విండీస్ మాజీ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా...

click me!

Recommended Stories