ఆ రూల్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందా... అంపైర్ తప్పిదం కారణంగా...

Published : Apr 13, 2021, 03:47 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్... క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించింది. 222 పరుగుల లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్, అద్భుత సెంచరీ కారణంగా ఆఖరి బంతిదాకా పోరాడింది రాజస్థాన్ రాయల్స్...

PREV
16
ఆ రూల్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందా... అంపైర్ తప్పిదం కారణంగా...

ఆఖరి బంతికి విజయానికి 5 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్‌కి ప్రయత్నించిన సంజూ శాంసన్, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో పంజాబ్ కింగ్స్‌కి 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది...

26

అయితే రాజస్థాన్ ఓటమికి అంపైర్ చేసిన తప్పిదమే కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.... రిలే మెడెరిత్ వేసిన 11వ ఓవర్, ఐదో బంతికి సంజూ శాంసన్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్...అయితే సంజూ వెంటనే రివ్యూ తీసుకున్నాడు...

36

టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే ఆ బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీసినా... అది లెక్కలోకి రాలేదు... దీంతో ఓ పరుగు తీసినా, డీఆర్‌ఎస్ నిబంధన ప్రకారం అది అంపైర్ ఖాతాలోకి వెళ్లింది...

46

ఆ పరుగు లెక్కలోకి తీసుకుని ఉంటే... ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులే కావాల్సి ఉండేది. ఆ సమయంలో సంజూ శాంసన్ సింగిల్ లేదా రెండు పరుగులు తీయడానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు...

56

ఇలా ఇంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ ఫోర్ బాదినా, ఈ రూల్ కారణంగా అది లెక్కలోకి రానట్టు...ఈసారి ఏకంగా మ్యాచ్ ఫలితాన్నే ప్రభావితం చేసింది...

66

సంజూ శాంసన్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసి ఆఖరి ఓవర్, ఆఖరి బంతికి దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుటైన విషయం తెలిసిందే...

click me!

Recommended Stories