టీమిండియా హెడ్‌కోచ్ పదవి స్వీకరించడానికి ఒప్పుకోని రాహుల్ ద్రావిడ్... అసలు కారణం ఇదేనట...

First Published Oct 14, 2021, 1:03 PM IST

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది. మరి ఆ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ ఎవరు? అండర్16, టీమిండియా ఏ జట్లకి కోచ్‌గా వ్యవహరించిన ఎన్‌సీఏ డైరెక్టర్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఆ బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించాడా?

2017లో అనిల్ కుంబ్లే రాజీనామా తర్వాత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రవిశాస్త్రి, రెండు పర్యయాలు తన కాంట్రాక్ట్‌ను పూర్తిచేసుకున్నాడు. శాస్త్రి ఇష్టపడితే, అతన్ని మరోసారి కంటిన్యూ చేయడానికి కూడా బీసీసీఐ సుముఖంగా ఉంది...

అయితే రవిశాస్త్రి మాత్రం టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగడానికి ఇష్టపడడం లేదు. భారత జట్టు ఓడిన ప్రతీసారి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శాస్త్రి, ఇక వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు...

రవిశాస్త్రి, ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న సమయంలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా తర్వాతి కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారని వార్తలు వినిపించాయి...

అయితే రాహుల్ ద్రావిడ్ మాత్రం పూర్తిస్థాయిలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకి ఎదురైన అవమానం కారణంగానే ద్రావిడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి...

అయితే అసలు నిజం వేరే ఉందట. రాహుల్ ద్రావిడ్‌కి తరుచుగా విదేశీ టూర్లంటూ తిరగడం ఏ మాత్రం నచ్చదట. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని మాటిచ్చిన ద్రావిడ్, ఆ మాటకు కట్టుబడి ఉండాలని ఫిక్స్ అయ్యాడట...

p>

టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటే మాత్రం సంవత్సరంలో ఆరేడు నెలలు వివిధ టూర్లు, టోర్నీల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. స్వదేశంలో మ్యాచులు కూడా ఒక్క చోట జరగవు. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్ అంటూ అటు చివరి నుంచి ఇటు చివరికి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది...

అందుకే కుటుంబంతో సమయం గడిపేందుకే నిర్ణయం తీసుకున్న రాహుల్ ద్రావిడ్, బెంగళూరులోని తన ఇంటికి దగ్గర్లో ఉండే జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగడానికే మొగ్గు చూపాడట...

అయితే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కి మాత్రం రాహుల్ ద్రావిడ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. నవంబర్ 14న టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటే, ఆ తర్వాత 3 రోజులకు నవంబర్ 17న జైపూర్‌లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది..

ఒకవేళ భారత జట్టు ఫైనల్ చేరితే, టీమిండియా బీ జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడే అవకాశం ఉంది. న్యూజిలాండ్ జట్టు కూడా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చేరితే, షెడ్యూల్‌ను ఎలా మేనేజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది...

click me!