ఇది అన్యాయం! ఈ మాత్రం దానికి ఆ మ్యాచులు ఎందుకు దండగ? తీసి... బీసీసీఐపై మాజీ క్రికెటర్ ఫైర్...

First Published Jan 18, 2023, 12:36 PM IST

15 ఏళ్ల క్రితం సంగతి. టీమిండియాలో చోటు దక్కాలంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిరూపించుకుంటే సరిపోయేది. రంజీ ట్రోఫీలో బాగా ఆడిన ప్లేయర్లకు టెస్టుల్లో, విజయ్ హాజారే ట్రోఫీ వంటి లిస్టు ఏ క్రికెట్‌లో రాణించిన ప్లేయర్లకు వన్డేల్లో చోటు దక్కేది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది...

Umran Malik

టీమిండియాలోకి రావాలంటే ఐపీఎల్ ఒక్కటే మార్గంగా మారిపోయింది. దేశవాళీ క్రికెట్ ఆడినా ఆడకపోయినా ఐపీఎల్‌లో బాగా ఆడితే చాలు, టీమిండియాలో చోటు దక్కుతోంది. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా నుంచి టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, వెంకటేశ్ అయ్యర్.. ఇలా ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్ల సంఖ్య వందల్లోనే ఉంది..

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీ20 ఫార్మాట్‌లో అవకాశం వస్తే కరెక్టే అనుకోవచ్చు కానీ టెస్టు, వన్డేలకు కూడా టీ20 లీగ్ పర్ఫామెన్స్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు సెలక్టర్లు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ రంజీ ట్రోఫీల్లో రికార్డు పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ని పక్కనబెట్టి, సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్ కిషన్‌లను టెస్టు టీమ్‌కి ఎంపిక చేయడమే...

37 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 3500లకు పైగా పరుగులు చేసి ‘డాన్ బ్రాడ్‌మెన్ ఆఫ్ రంజీ ట్రోఫీ’గా గుర్తింపు తెచ్చుకున్న సర్ఫరాజ్ ఖాన్‌ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు సెలక్టర్లు. గత రెండు సీజన్లలలో దాదాపు వెయ్యిసి పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఖాన్, 2022-23 సీజన్‌లోనూ 100+ సగటుతో పరుగులు చేస్తున్నాడు..
 

Sarfaraz Khan

తాజాగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో 155 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 125 పరుగులు చేసి అదరగొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో ఆదుకోవడంతో 293 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

Sarfaraz Khan

‘ఒకటి రెండూ కాదు ఏకంగా మూడు సీజన్లలో బ్లాక్ బస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత కూడా సర్ఫరాజ్ ఖాన్‌కి టెస్టు టీమ్‌లో చోటు దక్కకపోవడం అన్యాయం. ఇది అతన్ని కాదు, భారత దేశవాళీ క్రికెట్‌నే అవమానించడం. టీమ్‌కి సెలక్ట్ చేయడానికి ఈ ఫ్లాట్‌ఫాంతో సంబంధం లేనప్పుడు ఇంత ఖర్చు పెట్టి రంజీ ట్రోఫీ నిర్వహించడం దేనికి? తీసి పడేయండి...

సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌గా ఉన్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు చేస్తున్నాడు. ఒకవేళ అతని బరువే అడ్డంకి అయితే.. టీమిండియాకి ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్న ప్లేయర్లు చాలా మందే ఉన్నారు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్.. 

click me!