నీ గర్వం పక్కనబెట్టి ఆడితేనే గెలుస్తావ్... ఇండియాతో టెస్టు సిరీస్‌పై కమ్మిన్స్‌కి గిల్‌క్రిస్ట్ సలహా...

Published : Jan 18, 2023, 10:37 AM IST

యాషెస్ సిరీస్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గవాస్కర్ టెస్టు సిరీస్‌కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాలో పర్యటించి, టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు, ఈ సారి స్వదేశంలో ఆసీస్‌తో తలబడనుంది...

PREV
16
నీ గర్వం పక్కనబెట్టి ఆడితేనే గెలుస్తావ్... ఇండియాతో టెస్టు సిరీస్‌పై కమ్మిన్స్‌కి గిల్‌క్రిస్ట్ సలహా...

వచ్చే నెలలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇప్పటి నుంచే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ టెస్టు సిరీస్ ఫలితం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తులను కూడా ఖరారు చేస్తుండడంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు చూసే అవకాశం ఉంది...
 

26

2004 నుంచి ఇండియాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా జట్టు, ఈసారి ట్రోఫీతోనే వెనక్కి వెళ్లాలనే కసితో ఉంది. రిషబ్ పంత్ లేకపోవడం, అజింకా రహానే జట్టులో లేకపోవడం, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం... ఆసీస్‌కి కలిసొచ్చే అంశాలు...

36

2004లో ఇండియాలో టెస్టు సిరీస్ గెలిచినప్పుడు ఆస్ట్రేలియా సారథిగా ఉన్న ఆడమ్ గిల్‌క్రిస్ట్, ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కొన్ని సలహాలు, సూచనలు చేశాడు. ‘మేం ఇండియాలో అడుగుపెట్టేటప్పుడే మా మెంటల్టీని మార్చుకున్నాం...

46

ఆస్ట్రేలియన్లకు ఓ రకమైన గర్వం ఉంటుంది. అయితే ఇండియాలో అడుగుపెట్టేటప్పుడు ఆ గర్వాన్ని పక్కనబెట్టి రావాలి. మొదటి బంతి నుంచి స్టంప్స్‌ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ వేయాలి. కాస్త డిఫెన్సివ్‌గా, కొంచెం దూకుడుగా ఆడాలి...
 

56

ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో ఆడినట్టు ఇండియాతో ఆడితే గెలవడం కష్టం. ఫీల్డింగ్‌లోనూ డిఫెన్సివ్ అటాక్ పద్ధతిని ఫాలో అవ్వాలి. వికెట్ల పడడం లేదని సహనం కోల్పోయి ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ ఉంటే రిజల్ట్ తేడా కొట్టేస్తది. ఇక్కడ వికెట్ దక్కాలంటే సహనం కావాలి...
 

66

నలుగురు బెస్ట్ బౌలర్లను ఎంచుకో, వారినే కొనసాగించు. ముగ్గురు సీమర్లతో పాటు నాథన్ లియాన్ సరిపోతాడు. అతనొక్కడూ వికెట్లు తీయడానికి సరిపోతాడు... అయితే ఆ సమయంలో నువ్వు, నీ తెలివితేటలకు ఎలా పనిచేబుతావనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్.. 

click me!

Recommended Stories