అందుకే హార్ధిక్ పాండ్యాని పక్కనబెట్టేశారు... ముంబై ఇండియన్స్‌ జట్టుతో పాటు టీమిండియాకి కూడా...

First Published Jan 6, 2022, 6:31 PM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ద్వారా టీమిండియాలోకి వచ్చినవారిలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఒకడు. నాలుగేళ్ల పాటు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు అటు భారత జట్టుకి, ఇటు ఐపీఎల్‌లో సొంత టీమ్‌కి దూరమయ్యాడు...

Hardik Pandya

వెన్ను గాయం నుంచి  కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్న హార్ధిక్ పాండ్యా, రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయలేకపోయాడు...

తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో హార్ధిక్ పాండ్యాకి చోటు దక్కలేదు.సారథి రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, కిరన్ పోలార్డ్‌లను అట్టిపెట్టుకుంది ముంబై ఇండియన్స్...

రోహిత్ శర్మకు మొదటి రిటెన్షన్‌గా రూ.16 కోట్లు, రెండో రిటెన్షన్ బుమ్రాకి రూ.12 కోట్లు, సూర్యకుమార్ యాదవ్‌ని రూ.8 కోట్లకి, కిరన్ పోలార్డ్‌ను రూ.6 కోట్లకు అట్టిపెట్టుకుంది ముంబై ఇండియన్స్...

ముంబై ఇండియన్స్ జట్టు సహాయక సిబ్బంది, కోచింగ్ స్టాఫ్‌లో సభ్యుడైన జహీర్ ఖాన్... హార్ధిక్ పాండ్యాను అట్టిపెట్టుకోకపోవడానికి గల కారణాలను వివరించాడు...

‘హార్ధిక్ పాండ్యాని రిటైన్ చేసుకోకపోవడానికి అతని ఫిట్‌నెస్ ముఖ్యకారణం. హార్ధిక్ ఈ విషయం మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. త్వరలోనే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడు...

రిటెన్షన్ అనేది చాలా విషయాలను, అనేక కోణాలను దృష్టిలో పెట్టుకుని జరుగుతుంది. ఎవరిని అట్టిపెట్టుకోవాలనేదానిపై చాలా సుదీర్ఘ చర్చలే జరుగుతాయి...

Hardik Pandya

మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకునే ప్లేయర్లను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే టీమ్‌కి కీలకం అనుకున్న నలుగురునే ఎంచుకున్నాం...

ముంబై ఇండియన్స్ విజయంలో ప్రతీ ప్లేయర్‌కి భాగం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో సత్తా ఉన్న ప్లేయర్ల సంఖ్య పెరుగుతోంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్...

Hardik Pandya

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో ఫ్రాంఛైజీ తరుపున హార్ధిక్ పాండ్యా ఆడబోతున్నాడని, ఈ ఆల్‌రౌండర్ కోసం రూ.12 కోట్లు చెల్లించేందుకు ఈ కొత్త జట్టు సిద్ధమైందని సమాచారం...

click me!