విరాట్ కోహ్లీ 18 కాదు, స్మృతి మంధాన కోరుకున్న స్పెషల్ నెంబర్ వేరేనట...

First Published Jan 6, 2022, 5:35 PM IST

నెంబర్ 18కి క్రీడా ప్రపంచంలో సెపరేట్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. దాదాపు 2 వందల మంది ఫాలోవర్లు కలిగిన భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ అది. అంతేకాదు, టీమిండియా క్వీన్ స్మృతి మంధాన జెర్సీ నెంబర్ కూడా అదే...

విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్‌గా 18 సంఖ్యను ఎంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. విరాట్‌కి 18 ఏళ్ల వయసులో 18వ తేదీన తన తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణించారు... 

తండ్రి తనతో గడిపిన ఆఖరి రోజు, ఆఖరి జ్ఞాపకాలు ఎప్పుడూ తనతో పదిలంగాఉండాలనే ఉద్దేశంతో జెర్సీ నెంబర్‌ని 18గా ఎంచుకున్నాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ సూపర్ స్టార్‌గా ఎదిగిన తర్వాత క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జెర్సీ నెంబర్ కూడా 18... అయితే స్మృతి, కోరుకున్న నెంబర్ వేరేనట...

24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, వుమెన్స్ క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం నమోదుచేసిన భారత క్రికెటర్‌గా నిలిచింది స్మృతి మంధాన...

వన్డే, టెస్టు, టీ20ల్లో రాణిస్తూ... అతి కొద్ది కాలంలోనే వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హజరీలో కొన్ని మ్యాచులకు కెప్టెన్సీ కూడా చేసింది...

గత ఏడాది మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన స్మృతి మంధాన... ఐసీసీ ‘వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021’ అవార్డు రేసులో నిలిచింది... 

‘నిజానికి నేను నెంబర్ 7 జెర్సీ నెంబర్ కావాలని అడిగాను. ఎందుకంటే స్కూల్‌లో నా రూల్ నెంబర్ 7. అప్పటి నుంచి అది నా లక్కీ నెంబర్‌గా మారిపోయింది...

అయితే అప్పటికే 7 నెంబర్ జెర్సీ ఎవరో తీసుకున్నారు. దీంతో వికాస్ సర్ (అప్పటి కోచ్), మా టీమ్ మేనేజ్‌మెంట్... 18 నెంబర్ జెర్సీ తీసుకోవాలని సూచించారు...

అప్పటికే విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా ఆ జెర్సీతో ఆడుతున్నాడు. నేను కూడా కాదనలేకపోయాను... అలా 18 నా జెర్సీ నెంబర్‌గా మారింది...’ అంటూ చెప్పుకొచ్చింది స్మృతి మంధాన...

టీమిండియా తరుపున 62 వన్డేలు ఆడిన స్మృతి మంధాన... 19 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 2377 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల్లో ఓ సెంచరీతో 325 పరుగులు చేసింది... 84 టీ20 మ్యాచుల్లో 1971 పరుగులు చేసింది స్మృతి మంధాన...

టీమిండియా తరుపున 62 వన్డేలు ఆడిన స్మృతి మంధాన... 19 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 2377 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల్లో ఓ సెంచరీతో 325 పరుగులు చేసింది... 75 టీ20 మ్యాచుల్లో 1716 పరుగులు చేసింది స్మృతి మంధాన...

click me!