ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ఎమ్మెస్ ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే. మాహీ ప్లేస్‌లో రవీంద్ర జడేజా సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. దీంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో రోహిత్ డామినేషన్‌కి తిరుగు ఉండదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా బరిలో దిగబోతున్నాడు రోహిత్ శర్మ. ఐదు సార్లు టైటిల్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని కెప్టెన్సీలతో ఐపీఎల్ 2022 టైటిల్ కోసం పోటీపడబోతున్నాడు...
213
అదీకాకుండా ఐపీఎల్ 2022 సీజన్ ఆడబోతున్న కెప్టెన్లలో ఒక్క శ్రేయాస్ అయ్యర్, కేన్ విలియంసన్ మినహా, మిగిలిన కెప్టెన్లు ఎవ్వరూ కెప్టెన్‌గా ఫైనల్ మ్యాచ్ ఆడింది కూడా లేదు...
313
Shreyas Iyer-Rishabh Pant
ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్, గాయం ప్లస్ రిషబ్ పంత్ కారణంగా గత సీజన్‌లో ప్లేయర్‌గానే బరిలో దిగిన విషయం తెలిసిందే...
413
ఈసారి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్. గత సీజన్‌లో కేకేఆర్‌ను ఫైనల్‌కి చేర్చిన ఇయాన్ మోర్గాన్‌ని వేలానికి వదిలేసి, అతన్ని తిరిగి కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు కోల్‌కత్తా...
513
శ్రేయాస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కేకేఆర్, మనోడిపై భారీ ఆశలే పెట్టుకుంది... అయ్యర్ కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచి, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో నిలవాలని ఆశపడుతున్నాడు..
613
డేవిడ్ వార్నర్‌పై బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది బ్యాన్ పడడంతో ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నడిపించి, ఫైనల్‌కి చేర్చాడు కేన్ విలియంసన్...
713
అయితే ఫైనల్‌లో సీఎస్‌కే చేతుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాతి సీజన్‌లో తిరిగి వార్నర్‌కి కెప్టెన్సీ అప్పగించింది. వార్నర్ ఈసారి వైస్ కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడబోతుంటే, కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2022 సీజన్ ఆడనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
813
ఐపీఎల్ 2022లో మిగిలిన కెప్టెన్లు అందరూ రెండు, అంతకంటే తక్కువ సీజన్లలో కెప్టెన్సీ అనుభవం ఉన్నవాళ్లే...
913
కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో గత రెండు సీజన్లు ఆడిన పంజాబ్ కింగ్స్, ఆరో స్థానాన్ని దాటి అడుగు ముందుకు వేయలేకపోయింది... ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్సీ వహించబోతున్నాడు రాహుల్...
1013
గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సంజూ శాంసన్, అంతకుముందు సీజన్‌తో పోలిస్తే పాయింట్ల పట్టికలో ఆర్‌ఆర్ పొజిషన్‌ను కాస్త పెంచాడు. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో 2020 సీజన్‌లో ఆఖరి ప్లేస్‌లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, 2021 సీజన్‌లో శాంసన్ కెప్టెన్సీలో ఏడో స్థానంలో ముగించింది...
1113
అయ్యర్ గాయపడడంతో గత ఏడాది లక్కీగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మారిన రిషబ్ పంత్... గ్రూప్ స్టేజీలో తన టీమ్‌ను టేబుల్ టాపర్‌గా నిలిపాడు. అయితే క్వాలిఫైయర్ మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ, మూడో స్థానానికే పరిమితమైంది..
1213
హార్ధిక్ పాండ్యా, ఫాఫ్ డుప్లిసిస్, రవీంద్ర జడేజా ఈ ఏడాది నుంచే కెప్టెన్‌గా కెరీర్ మొదలుపెడుతుంటే, గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌కి కెప్టెన్సీ చేసిన మయాంక్ అగర్వాల్... పంజాబ్ సారథ్య బాధ్యతలు మోయబోతున్నాడు...
1313
ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మతో ఒక్క టైటిల్ కూడా గెలవని కెప్టెన్లు, అందులోనూ కుర్రాళ్లు (డుప్లిసిస్, జడేజా మినహా మిగిలిన వారంతా 30 ఏళ్లలోపు వారే) కావడంతో... ఐపీఎల్ 2022 సీజన్ వార్ వన్‌సైడెడ్ అన్నట్టుగా సాగుతుందేమోనని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...