TATA IPL: ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు కుర్రాళ్లు ఎంతమంది..? ఏ ఏ జట్టులో ఉన్నారు..?

Published : Mar 26, 2022, 01:35 PM IST

TATA IPL 2022 Updates: బీసీసీఐ ఆధ్వర్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-15 సీజన్ మరికొద్దిగంటల్లో మొదలుకానుంది. దేశ, విదేశాల నుంచి  ఆటగాళ్లు ఆడుతున్న ఈ  మెగా లీగ్ లో మన తెలుగు కుర్రాళ్లు ఎంతమంది...? 

PREV
16
TATA IPL: ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు కుర్రాళ్లు ఎంతమంది..? ఏ ఏ జట్టులో ఉన్నారు..?

ఐపీఎల్-2022 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. శనివారం  సాయంత్రం ఈ మెగా సీజన్  ను ఆరంభించడానికి  డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధమవుతున్నాయి.  మరి  దేశ విదేశాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడుతున్న తెలుగు కుర్రాళ్లు ఎంతమంది..? వాళ్లు ఏ ఏ జట్టు తరఫున ఆడుతున్నారో ఇక్కడ చూద్దాం. 

26

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవలే బెంగళూరు వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలం ప్రక్రియలో 23 మంది (మొత్తం 370 మంది భారతీయులలో)  తెలుగు కుర్రాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

36

ఐపీఎల్ వేలంలో పాల్గొన్న వారిలో (హైదరాబాద్ నుంచి) హనుమా విహారి, తిలక్ వర్మ, బి. సందీప్, తన్మయ్ అగర్వాల్, తన్హయ్ త్యాగరాజన్, సివి మిలింద్, రాహుల్ బుద్ధి, యుద్వీర్, కార్తీకేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీష్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వల్, ఎండీ అఫ్రిది ఉన్నారు. 

46

ఇక ఆంధ్రా నుంచి... అంబటి రాయుడు, అశ్విన్ హెబ్బర్్, రికీ భుయ్, హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్ రెడ్డిలు వేలంలో పాల్గొన్నారు. 

56

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 23 మంది వేలానికి వచ్చినా వారిలో ఏడుగురు మాత్రమే ప్రస్తుతం  ఐపీఎల్-2022 సీజన్ లో ఆడుతున్నారు.  వారిలో ఆంధ్రా నుంచి అంబటి రాయుడు, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమవ్వగా..  కెఎస్ భరత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.

66

ఇక హైదరాబాద్ నుంచి మహ్మద్ సిరాజ్, సివి మిలింద్ లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమవ్వగా.. రాహుల్ బుద్ది, ఠాకూర్ తిలక్ వర్మలు ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

click me!

Recommended Stories